ఏపీలో 'వార్-2' మాస్ సెలబ్రేషన్స్..ఇదేందయ్యా ఇది .. యాడ చూడలా
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన 'వార్-2' సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ అభిమాన సంఘాలు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
పలు నగరాల్లోని థియేటర్ల ముందు ఎన్టీఆర్, హృతిక్ భారీ కటౌట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు రోజు నుంచే అభిమానుల సందడి మొదలైంది. ఎన్టీఆర్ పాటలతో అభిమానులు థియేటర్ల దగ్గర డ్యాన్సులు చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

థియేటర్ల వద్ద ఫ్యాన్స్ డప్పుల మోతలతో, బాణసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి,జమ్మలమడుగు వంటి ప్రధాన నగరాల్లోని థియేటర్లలో భారీ సంఖ్యలో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ పాత్రపై భారీ అంచనాలు ఉండటంతో, ఆయన స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ అభిమానుల కేరింతలు, విజిల్స్ హోరెత్తడం ఖాయమని భావిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో ఈ వార్-2పై భారీ అంచనాలు నెలకున్నాయి.












Click it and Unblock the Notifications