Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో పైలెట్ ప్రాజెక్టుగా: నెల్లూరు ఆసుపత్రిలో ప్రారంభం: కరోనా నుంచి వారి రక్ష కల్పించేలా..!

నెల్లూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ 10 రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటోంది. ఆయా జిల్లాల్లోని సాధారణ ఆసుప్రతులన్నింటినీ కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చి వేసింది ప్రభుత్వం. రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పేషెంట్లకు అనుగుణంగా హెల్త్ వర్కర్ల సంఖ్యను కూడా రెట్టింపు చేసుకోవాల్సి వస్తోంది.

ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రోబోల సహాయంతో కరోనా పేషెంట్లకు వైద్య సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరులోని కోవిడ్ ఆసుపత్రిలో రోబోతో కరోనా పేషెంట్లకు వైద్య సేవలను అందిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే..మరిన్ని రోబోలు అందుబాటులోకి వస్తే..కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రుల్లో వాటి సేవలను వినియోగించుకోబోతోంది.

Andhra Pradesh: Govt deploys Robot To Serve COVID-19 Patients In Nellore

నెల్లూరుకు చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దీన్ని జిల్లా అధికారులకు అందించారు. దీని పనితీరుపై ఆ సంస్థ ప్రతినిధులు కోవిడ్‌-19 ప్రత్యేక అధికారి రామ్‌ గోపాల్‌, కలెక్టర్‌ శేషగిరి బాబులకు వివరించారు. ఈ రోబో పనితీరును పరిశీలించిన తరువాత వైద్య సేవల కోసం రోబోను వినియోగించాలని నిర్ణయించారు. ఐసొలేషన్ వార్డుల్లో ఈ రోబో ద్వారా కరోనా పేషెంట్లకు మందులు, ఆహారాన్ని అందజేస్తారు.

ఈ రోబో సుమారు 40 నుంచి 50 కేజీల బరువును ఒకేసారి మోయగలుగుతుందని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదివరకు తమిళనాడులో రోబోల సహాయంతో కరోనా వైరస్ పేషెంట్లకు వైద్య సహాయాన్ని అందించే ప్రాజెక్టును ప్రారంభించారు. మధురై జిల్లాలో దీన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం దాన్ని ఇతర జిల్లాలకు విస్తరించారు. అదే తరహాలో నెల్లూరులో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన రోబోల సేవలను క్రమంగా ఇతర జిల్లాల్లో విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

Recommended Video

    Gaganyaan Mission : ISRO To Place half Humanoid 'Vyommitra' In Gaganyan

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+