Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనం
విజయవాడ: కొద్ది రోజుల కిందటే విజయవాడ కృష్ణలంక సమీపంలో కృష్ణా నదిలో కొట్టుకుని పోతున్న ఓ మహిళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. నదిలో దూకి మరీ ఆమెను కాపాడారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తరువాత కృత్రిమ శ్వాసను అందించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి, ఆమె ప్రాణాలను నిలపడంలో తనవంతు కృషి చేశారు. అలాంటి ఉదంతమే ఆదివారం ఉదయం కృష్ణా జిల్లాలోనే మరొకటి చోటు చేసుకుంది.
జిల్లాలోని అవనిగడ్డ సమీపంలో గల పులిగడ్డ-పెనుమూడి వంతెన వద్ద పోలీసులు ప్రమాద రహిత దినోత్సవాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా- ఈ ఉదయం నుంచి వంతెన వద్ద వాహనదారులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ యువతి వంతెన పైనుంచి నదిలో దూకేశారు. ప్రమాద రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోన్న ఎఎస్ఐ మాణిక్యాల రావు, కానిస్టేబుల్ గోపిరాజు ఈ దృశ్యాన్ని చూశారు.

క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఏ మాత్రం ఆలోచన చేయకుండా తాము కూడా నదిలో దూకేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ నిండుగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ.. వారు లెక్క చేయలేదు. నదిలో దూకి, ఆమెను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం చికిత్స కోసం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాణిక్యాలరావును, గోపిరాజును అభినందించారు.


-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications