ఏపీలో సాధారణం కంటే అధికం: ఈ జిల్లాల్లో..
Heavy rain in AP: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అడపా దడపా వర్షాలు పడుతోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.
వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు.

నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, తిరుపతి జల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని కూర్మనాథ్ వివరించారు. ఇదే పరిస్థితి ఈ నెల 5వ తేదీ వరకు ఉంటుందని అంచనా వేశారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొన్నారు.
జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో సగటు వర్షపాతం 99.4 మిల్లీ మీటర్లు. కాగా ఈ ఏడాది అదే జూన్ నెలలో రాష్ట్రంలో 162.3 మిల్లీ మీటర్ల మేర అధిక వర్షపాతం రికార్డయింది. 19 జల్లాల్లో అత్యధికం, అయిదు జిల్లాల్లో అధికం, రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు కూర్మనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications