జగన్ చేసిన అప్పులెంత - రాష్ట్ర రుణభారం లెక్క ఇదీ..!!

ఏపీ మొత్తం రుణభారం పై స్పష్టత వచ్చింది. జగన్ హయాంలో చేసిన అప్పుల గురించి ఎన్నికల సమయంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. జగన్ తన మేనిఫెస్టో విడుదల సమయంలో నాడు చంద్రబాబు, తన హయాంలో చేసిన అప్పుల గురించి వివరించారు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్దిక పరిస్తితిపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమైంది. అన్ని రకాల అప్పులతో పాటుగా చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం లెక్కలను బయట పెట్టనుంది.

శ్వేతపత్రం సిద్దం
ఏపీ ఆర్దిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర అప్పు దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఆర్థికశాఖ అధికారులు రూపొందించిన శ్వేతపత్రంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. శ్వేతపత్రంలోని వివరాల మేరకు రాష్ట్ర అప్పు 9,82,498 రూపాయలు ఉన్నట్లు తేలింది .ప్రధానంగా భారీగా అప్పులు చేసినా, వాటిని ఎక్కడ ఖర్చు చేసారన్నది ఇరదులో ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 9,82,498 కోట్లు అప్పుగా ఉన్నట్లు తేల్చారు.

Andhra Pradesh s debt is Rs 10 Lakh cr Govt to release white paper on finance

అప్పుల లెక్క ఇలా
2019 మార్చి నాటికి 3.75 లక్షల కోట్ల వరకు రుణం ఉండగా, ఇప్పుడు ఆ రుణం 9.82 లక్షల కోట్లు దాటిపోయిందని శ్వేతపత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇందులో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులే 2.48 లక్షల కోట్లు ఉన్నట్లు తేల్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి, ఆ తరువాత 2019 నుంచి 2024 మధ్యలో నెలకొన్న సంక్షోభం వంటివి శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. పలు రంగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1.20 లక్షల కోట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ముందెకెళ్లేదెలా
అయితే ఈ నివేదికలో పలు ప్రభుత్వ పథకాల కోసం రిజర్వ్‌ బ్యాంకు, జైకా, ఆసియన్‌ డెవలప్‌మెరట్‌ బ్యాంకు, హడ్కో, నబార్డ్‌ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు ఎంత అన్నది పేర్కొనలేదని, ఇది కూడా కలుపుకొంటే మొత్తం రుణం 13 నుంచి 14 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. రెండు ప్రభుత్వాల హయంలో జిడిపి వృద్ధి ఎలా ఉందన్నదానిపైనా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది. జాతీయ వృద్ధి, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాల్లో నెలకొన్న రాష్ట్ర వృద్ధిని క్రోడీకరించి నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను కూడా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+