Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్! ఇంత చవటా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ తీవ్ర వ్యాఖ్యలు, ‘పవన్ అలా అనలేదు’

నెల్లూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా.. పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

    Chiranjeevi's shadow Still haunts Pawan, Roja Strong Words On Pawan

    శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం నుంచి బరిలో దిగిన చిరంజీవి ఎన్నికల్లో ఓడిపోగానే ఆయనను మోసం చేసిన తొలివ్యక్తి తమ్ముడు పవన్‌ కళ్యాణేనని విమర్శించారు.

    అభిమాన నటుడు ఇంత చవటా..

    అభిమాన నటుడు ఇంత చవటా..

    తాను అభిమానించే సినీ హీరో ఇంత చ‌వట అనుకోలేదంటూ అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు ఏ కష్టం వచ్చిన హడావుడి చేసే పవన్‌ సొంత అన్న చిరంజీవిని మాత్రం మోసం చేశాడన్నారు. బాబుకు మద్ధతు ఇస్తుండటంతో పార్టీ ఫిరాయింపులపై పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

    నైతిక విలువలున్నాయా?

    నైతిక విలువలున్నాయా?

    ‘చంద్రబాబును వెనుకేసుకు రావడం పవన్‌కు అలవాటైంది. పవన్‌ రాజ్యాంగం, విలువలు అని మాట్లాడతారు. కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటుంటే మాట్లాడలేని పవన్‌కు నైతిక విలువలున్నాయా' అంటూ అనిల్ మండిపడ్డారు. ‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా?' అని పవన్‌ను ప్రశ్నించారు. ‘నేను చదువుకునే రోజుల్లో పవన్ అభిమానినేనని, అయితే ఈ రోజు ఆయన తీరు ఇలా ఉంటుందనుకోలేదు. ఒకప్పుడు నేను సినిమాల్లో అభిమానించిన వ్యక్తి ఇంత చవటా' అని బాధపడుతున్నానని చెప్పారు. ఆ హీరో ఇంతలా ఓ వ్యక్తి వెనకాల దాక్కుంటాడా? ఇంత అధైర్యస్తుడా అని ఎద్దేవా చేశారు.

    చేతులు కట్టుకుని కూర్చోవాలా?

    చేతులు కట్టుకుని కూర్చోవాలా?

    ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి నాకు లేదు, నేను చిన్న వ్యక్తిని అంటున్న పవన్.. ఏం నాయకుడు..? మరి దేని గురించి ప్రశ్నిస్తావంటూ ఎమ్మెల్యే అనిల్ మండిపడ్డారు.

    ‘చంద్రబాబుకు కష్టాలొస్తే.. ప్రజల కోసం పనిచేస్తున్న వైయస్ జగన్‌ను నువ్వు ప్రశ్నిస్తావా. మీరు మాత్రం పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు కావాలని కోరుకోవచ్చు. ప్రజల కోసం పోరాడుతున్న నేత వైయస్ జగన్ మాత్రం ముఖ్యమంత్రి కావాలని కోరుకోకూడదా?. నీవు ఏం మనిషివి. ఎవరైనా నా గురించి మాట్లాడితే ఒప్పుకోను అంటావు. నువ్వు మాత్రం ఊర్లో వారందరి గురించి మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా' అంటూ అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.

    డ్రామా కంపెనీ పెట్టుకోండి..

    డ్రామా కంపెనీ పెట్టుకోండి..

    ‘ఏపీలో అవినీతి పెట్రేగిపోతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాని గురించి ప్రశ్నించలేని వ్యక్తి దేని గురించి ప్రశ్నిస్తావు. చంద్రబాబు చెప్పే స్క్రీప్ట్‌ చదివే నువ్వు ఏం మాట్లాడుతావు. నువ్వు, చంద్రబాబు కలిసి ఓ పెద్ద డ్రామా కంపెనీ పెట్టుకోండి' అంటూ పవన్ కళ్యాణ్‌పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.

    పవన్ ఏనాడూ అలా అనలేదు

    పవన్ ఏనాడూ అలా అనలేదు

    సినీన‌టుడు, జ‌నసేన అధినేత‌ ప‌వ‌న్ కళ్యాణ్ కాపుల‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నార‌ని కొంద‌రు అంటున్నారని, అదేమీ లేద‌ని సినీ న‌టి హేమ అన్నారు. శుక్రవారం మాట్లాడిన ఆమె.. తాను కాపుల‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించానని, కాపుల పోరాటంలో మెంబ‌ర్‌గా ఉన్నానని చెప్పారు. ఓ సారి కాపుల విష‌యంపై జ‌రిగిన చ‌ర్చ‌లో తాను పాల్గొన్నానని అన్నారు. కాపుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడు క‌దా? అని తాను ఒకసారి కాపు పెద్ద‌ల‌ని అడిగానని అన్నారు.

    పవన్ అందుకు ఇష్టపడడు

    పవన్ అందుకు ఇష్టపడడు

    ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ది కాపు వ‌ర్గం అని చెప్పుకోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌డం లేదని వారి నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ రోజు కూడా తాను కాపున‌ని చెప్పుకోలేదని హేమ అన్నారు. మనుషులందరూ ఒక‌టే అని ప‌వ‌న్ అంటార‌ని హేమ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తే కాపుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తాము ఏమీ అనుకోవ‌డం లేద‌ని హేమా వ్యాఖ్యానించడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+