ఏపీలో మరో దారుణం..విద్యార్థిని బైక్‌పై ఎత్తుకెళ్లి అత్యాచారం
ఏపీలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం నూతిపాడు గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.ఇంటర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.కాలేజీ ముగించుకొని ఇంటికి వెళుతున్న విద్యార్థినిని మరో ఇద్దరు స్నేహితుల సాయంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. విషయం తెలిసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఏలూరులో మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నిందితుడు గతంలో అనేకమార్లు సదరు యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇక కోల్‌కతా జునియర్ డాకర్ట్‌పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. హత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారట. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మరువక ముందే ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు పని చేస్తుండగా, ఆమె మృతదేహం రాంపూర్ జిల్లాలో ఖాళీ స్థలంలో కనిపించింది. ఈ భయంకరమైన సంఘటన ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది.ఈ ఘటన జూలై 30న జరిగినట్లు పోలీసులు తమ నివేదిక పేర్కొన్నారు. జూలై 31న, బాధితురాలి సోదరి అంతకుముందు రాత్రి ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆగస్టు 8న నర్సు మృతదేహాన్ని గుర్తించారు.
ఈ కేసులో పోలీసులు అనుమానితుడు ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు ధర్మేంద్ర కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న నర్సుపై కుమార్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మొదట ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలను దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications