ఘట్టమనేని వారసుడికి టీడీపీ నేతల సపోర్ట్
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. హీరో రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. జయకృష్ణ అరంగేట్రం చేస్తోన్న శ్రీనివాస మంగాపురం సినిమా ఫస్ట్ లుక్ విడులైన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు టీడీపీ నేతల నుంచి సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలిపారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. ఆయనతో పాటుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సైతం సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
తెలుగు ప్రజల అభిమాన నటుడు, పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హాజరుకాగా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, నిర్మాత అశ్వనీదత్, పద్మాలయా సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణం రాజు మాట్లాడుతూ..
సూపర్ స్టార్ కృష్ణ మంచికి మరో పేరు, కృష్ణ అభిమానులు కూడా మంచి మనసున్నవారు. ఇప్పటికీ సూపర్ స్టార్ అంటే కృష్ణనే, విజయవాడతో కృష్ణకు అనుబంధంతో ఇక్కడ ఆయనకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. నేడు కృష్ణ నటించిన అగ్నిపర్వతం విడుదలైన రోజు. యువ అగ్ని పర్వతం (జయ కృష్ణ)ను కూడా కృష్ణ అభిమానుల ముందుకు తీసుకురావడానికి అశ్వినిదత్, జెమిని కిరణ్ సంకల్పించారు. కృష్ణ, మహేష్ బాబులను ఆశీర్వదించిన విధంగానే జయ కృష్ణపై కూడా అభిమానం చూపించాలని కోరుతున్నా. జయకృష్ణతో ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మంచి లవ్ కమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. కృష్ణ మనవడు అంటే, కృష్ణ అభిమానులందరికి మనవడే. జయకృష్ణ అందంగా, ఎంతో ముద్దుగా ఉన్నాడని... అలాగే యాక్షన్‌తో కూడా అదరగొడతాడు. కృష్ణ మంచితనం, మహేష్ బాబు యాక్షన్ కలిసిన కుర్రాడు జయ కృష్ణ. జయ కృష్ణ చిత్రం విజయవంతం కావాలి - అని అన్నారు
పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ కి విజయవాడ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదని, ఆత్మీయ అనుబంధం వుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియో లో ఎప్పుడు కలిసినా "విజయవాడ ఎలా ఉంది?" అని ఆప్యాయంగా అడిగే వారని గుర్తు చేశారు. విజయవాడ అంటే సూపర్ స్టార్ కృష్ణ కి ఎంతో ప్రేమ, ప్రత్యేకమైన స్థానం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. 'ఈనాడు' సినిమాలోని రామరాజు పాత్ర వేషధారణ రూపంలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.
Legendary #SuperstarKrishna garu’s bronze statue is unveiled on the soil of Vijayawada, where the Greatest Mass Hero once enjoyed craze of unimaginable magnitude 💥💥@urstrulyMahesh pic.twitter.com/YgdzocfX2q
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) January 11, 2026
అశ్వినీదత్ బ్యానర్‌లో హీరోగా అరంగేట్రం చేస్తున్న జయకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ రూపం, వ్యక్తిత్వం మహేష్ బాబును తలపిస్తోందని ప్రశంసించారు. అశ్వినీదత్ - జయకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం విజయవాడ ప్రజలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
అనంతరం హీరో జయకృష్ణ మాట్లాడుతూ.. మహేశ్ బాబుకు వీరాభిమానిని నేను. బాబాయ్ మహేశ్ బాబు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తారు. తాతయ్య ఎప్పుడూ నా పక్కనే ఉండి నడిపిస్తున్నారు. తాతయ్య కృష్ణ గర్వపడేలా ఉండడమే నా లక్ష్యం... నా జీవిత ఆశయం.. అని అన్నారు. అశ్వినీదత్ చేతుల మీదగానే మా ముగ్గురి సినిమాలు లాంచ్ అయ్యాయి. ఇందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications