మరోసారి దుమారం: ఫోన్లో బండబూతులు తిట్టిన బాలకృష్ణ పీఏ
హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ కాంట్రాక్టర్‌ను బండబూతులు తిడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో మీడియాకు దొరికింది.
ఇప్పటికే పీఏ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా బెదిరించాడు. బూతులు తిట్టాడు. కాంట్రాక్టర్‌కు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు.

అసలు హిందూపురం ఎందుకు వచ్చావని నిలదీశాడు. హిందూపురంలో కనబడితే తాట తీస్తానని, చెప్పుతో కొడతానని తిట్టాడు. దానికి సదరు కాంట్రాక్టర్ తాము ఎక్కడో ఒకచోట చేసుకొని బతుకాలి కదా అన్నారు. పని చేసుకోవడానికి ఎక్కడైనా ఒకటే కద అన్నా.. అన్నాడు.












Click it and Unblock the Notifications