AP and TS rains: ఏపీలో మరో 3రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలోనూ

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

తీవ్ర అల్పపీడనం..

తీవ్ర అల్పపీడనం..

ఈ అల్పపీడనం రాగల 12 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందన్నారు.
ఆ తర్వాత 48 గంటలలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య విస్తరించి ఉందన్నారు. ఇక రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన 'ఉపరితల ద్రోణి' బలహీనపడిందని అధికారులు తెలిపారు. అలాగే.. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడిన 'ఉపరితల ఆవర్తనం' బలహీనపడిందన్నారు.

ఏపీలో విస్తారంగా వర్షాలు, ఆయా జిల్లాల్లో భారీ వానలు

ఏపీలో విస్తారంగా వర్షాలు, ఆయా జిల్లాల్లో భారీ వానలు

ఇక అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను ప్రకటించారు. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. శనివారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీవర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. .

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్రాలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉంది.ఆదివారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుందన్నారు. శుక్రవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం నాడు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు, తెలంగాణలోనూ మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+