Weather update: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కొసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

 AP and TS Weather: next two days rain in andhra Pradesh and telangana districts

ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిదింటి వరకు మెదక్‌ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కుల్‌ అత్యధికంగా 14.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా కోమరిన్‌ తీరం వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గ్యాంగ్టక్‌, పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నదని తెలిపింది.

దీని ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో 12.10 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో 10.03 సెం.మీ., పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 9.08 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+