అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు - కీలక నిర్ణయం దిశగా..!?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముమూర్తం ఖరారైంది. కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముమూర్తం ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. 27వ తేదీన ఏపీ కొత్త గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న సంతాప తీర్మానాలతో పాటుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ప్రారంభం కానుంది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ భేటీ జరగనుంది. అందులో సమావేశాలనిర్వహణ..బిల్లులు..అజెండా తో పాటుగా కీలకమైన బడ్జెట్ ప్రతిపాదించే తేదీ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో అందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు సమావేశాలకు విరామం ఇవ్వాలని యోచిస్తున్నారు. తిరిగి మార్చి 6వ తేదీ నుంచి సమావేశాలు కొనసాగనున్నాయి. 13 పని దినాలు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు ప్రాధన్యత ఉంది. ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో కీలక ప్రకటనలకు అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ నెల 23న మూడు రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఏం చెబుతుందనే దాని కి అనుగుణంగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే విచారణ పైన సుప్రీంకు లేఖ రాసింది.

AP Assembly Budget sessions to begin on 27th of this month with Governor address

అన్ని అనుకూలిస్తే మార్చి 22న ఉగాది నాడు విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో రాజధానుల బిల్లు పైన ప్రభుత్వం సిద్దం అవుతోంది. కోర్టు తీర్పు ఆలస్యం అయితే ఏం చేయాలనే దాని పైన ప్రభుత్వం ప్లాన్ బీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 9 లేదా 10న 2023-24 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దీని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమావేశాల్లో రాజధానుల పైన నిర్ణయం కీలకం కానుంది. అదే విధంగా.. ఈ సమావేశాలకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండనున్నారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు..ఇటు కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తల నడుమ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల పైన ప్రభుత్వం రేపు అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+