నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. : వారిద్దరే ప్రత్యేక ఆకర్షణ

Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు.

ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య గురువారం సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రమాణం చేయించారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో అందరికంటే సీనియర్ అయిన శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీ.

AP Assembly session will commence from today

శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన నంబర్ల ప్రకారం.. ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంతో మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంతో ముగుస్తుంది. తొలుత ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రమాణం చేసే అవకాశం ఉంది.

AP Assembly session will commence from today

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన మరో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. గత సభలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికే దక్కింది ఈ స్పీకర్ పదవి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పని చేశారు.

డిప్యూటీ స్పీకర్ పదవి కూటమి భాగస్వామ్య పక్షాలకు దక్కే అవకాశం ఉంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ శాసన సభ్యుడు పంతం నానాజీ, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీకి దక్కుతుందనే ప్రచారం సైతం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+