అసెంబ్లీలో ప్రవేశపెట్టదలచుకోని చంద్రబాబు

AP Assembly Budget Sessions 2024: ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.

ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. మూడు నెలల కాలానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభకు సమర్పిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టనుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

AP assembly sessions live updates in telugu  chandrababu govt to continue vote on account budget

Jul 23, 2024, 12:35 pm IST

గ్రామాల అభివృద్ధి కోసం 14, 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన 9,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు గత ప్రభుత్వ హయాంలో మళ్లించినట్లు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
Jul 23, 2024, 12:14 pm IST

గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ శాఖలో భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
Jul 23, 2024, 11:37 am IST

వచ్చే ఏడాది వరకు రాష్ట్రంలో గల అన్ని విద్యాసంస్థలు, కళాశాలను ప్రక్షాళన చేస్తాం. అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకుని వస్తామని అసెంబ్లీలో తెలిపిన మంత్రి నారా లోకేష్.
Jul 23, 2024, 11:26 am IST

నాడు-నేడు పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరుపుతామని, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్.
Jul 23, 2024, 9:59 am IST

వివిధ కార్పొరేషన్ల పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లులను నేడు అసెంబ్లీలో పెట్టనున్న టీడీపీ-జనసేన ప్రభుత్వం.
Jul 22, 2024, 11:21 am IST

వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
Jul 22, 2024, 10:50 am IST

ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఫలితంగా విభజన ఆంధ్ర తీవ్రంగా నష్ట పోయిందని పేర్కొన్న గవర్నర్. విభజనతో రెవెన్యూలోటు కారణంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొందని వెల్లడి.
Jul 22, 2024, 10:39 am IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు
Jul 22, 2024, 10:33 am IST

వైసీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
Jul 22, 2024, 10:32 am IST

ఏపీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.
Jul 22, 2024, 10:30 am IST

నల్లకండువాలను ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైఎస్ జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు. వాళ్ల చేతుల్లో ఉన్న ప్లకార్డులను చించివేసే ప్రయత్నం.
Jul 22, 2024, 10:08 am IST

నల్లకండువాలను ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైఎస్ జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు
Jul 22, 2024, 8:14 am IST

మూడు నెలల కాలానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వం.
Jul 22, 2024, 7:32 am IST
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+