కోడలి మరణం తర్వాత తొలిసారి కన్నా.. సుహారిక పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..
చిన్న కోడలు సుహారిక ఆకస్మిక మృతితో విషాదంలో కూరుకుపోయిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తిరిగి ఆదివారం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై ఆయన స్పందించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోన్నవేళ.. కన్నా కీలక సూచన చేశారు.
"ఏపీ ప్రభుత్వానికి నేనిచ్చే గట్టి సలహా ఏంటంటే... హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకాన్ని అంగీకరించాలి. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తే దాని వల్ల జాతీయ స్థాయిలో ఏపీకి ఉన్న మంచి పాడవుతుంది. అంతేకాదు, న్యాయవ్యవస్థకు ఉన్న గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించిటనట్లు అవుతుంది''అంటూ కన్నా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే, కన్నా చిన్నకోడలు సుహారిక మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో శుక్రవారమే పోస్టుమార్టం చేయగా, అదే రోజు కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో సుహారిక మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో సుహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. శరీరంలో ఎలాంటి గాయాలు కనిపించదని, ఆమె గుండె పోటుతోనే మరణించారని ప్రాథమికంగా తేల్చినట్లు పోలీసులు తెలిపారు.

సుహారిక మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే మృతదేహాన్ని బంధువులకు అప్పటించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత కేసును క్లోజ్ చేసే అవకాశాలున్నట్లు తెలిపారు. భర్త కన్నా ఫణీంద్రతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్ విల్లాస్‌లో నివసించిన సుహారిక.. గురువారం మాదాపూర్ లో బంధువు పవన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు డాక్టర్లు తేల్చారు. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరికి ఎవరిపైనా అనుమానంలేదని తేల్చారు.
Recommended Video
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications