ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో..ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు..!

ఏపీలో నగ్న వీడియోలు ట్రెండ్ నడుస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, జనసేన నేత జానీపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.తనని లైంగికంగా వేధించారని, ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఇక ముంబై నటి కాదంబరీ జెత్వానీ గత వైసీపీ ప్రభుత్వం వేధించిందనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళతో సదరు బీజేపీకి చెందిన వీడియో బుధవారం రాత్రి నుండి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

AP BJP leader nude video has gone viral on social media

ఈ వీడియో కాల్‌లో బీజేపీ నేత రేపు వస్తావా అంటే , వస్తానని మహిళ చెప్పడం వినిపించింది. మందు కొడదామా అంటూ కూడా సదరు మహిళను బీజేపీ నేత ప్రశ్నించారు. దానికి కూడా మహిళ ఓకే చెప్పడం వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. అయితే ఈ విషయం పెద్దది కాకముందే పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. బీజేపీ మీడియా వ్యవహారాలు చూసే నాయకుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపి అధిష్టానానికి నివేదిక పంపనున్నట్టు తెలుస్తోంది.ఇలా అధికార పార్టీలకు చెందిన నాయకులు వరుసగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే ఈ వీడియోలు బయటికి రావడంపై సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+