ఉద్యోగ విరమణ వయసుపై మంత్రివర్గం కీలక నిర్ణయం..!!
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు వీలుగా కొత్త పాలసీల కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో డ్రోన్ పాలసీని ఆమోదించింది. అదే విధంగా .. కుప్పంతో పాటుగా పిఠాపురంలోనూ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ప్రోహిబిషన్ 2024కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాజకీయ అంశాల పైనా చర్చ జరిగింది.
ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణల పైన చర్చ జరిగింది. ఇక, ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా చట్ట సవరణకు నిర్ణయించారు. ఇందు కోసం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ప్రోహిబిషన్ 2024కు ఆమోదం తెలిపారు. అదే విధంగా 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనుల ప్రారంభానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.

అదే సమయంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లును కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను మంత్రి మండలి ఆమోదించింది. రాష్ట్రంలో కొత్త డ్రోన్ పాలసీని కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ రంగంలో 40 వేల మందికి ఉపాధి లక్ష్యంగా పాలసీని రూపొందించింది .ప్రపంచంలోనే బెస్ట్ డ్రోన్ సెంటర్ గా ఏపీ లోని ఓర్వకల్లును డెవలప్ చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయను న్నారు. దీంతో పాటుగా ఏపీ ఎక్స్రైజు చట్ట సవరణ ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లో ఆర్ధికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదం తెలిపింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. దీని ద్వారా ప్రత్యేకంగా ఆర్దికంగా వెసులుబాటు కల్పించటంతో పాటుగా ప్రత్యేక నిర్ణయాలకు వెసులుబాటు కలుగుతుంది. ఇక.. అమరావతి సీఆర్డీఏ పరిధిని 8352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పలనాడు, బాపట్ల అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీల నుంచి 11 మండలాల్లో 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక..ఏపీలో జ్యూడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సును 61కి పెంచుతూ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications