సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాపై కేంద్రం నిర్ణయం..!!
Siddharth Kaushal IPS: ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్.. రాజీనామా చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
ఆయన రాజీనామాపై నిర్ణయాన్ని తీసుకుంది. రాజీనామాను ఆమోదించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆమోదంతో ఇక సిద్ధార్థ్ కౌశల్ అడుగులు ఎటు పడతాయనేది చర్చనీయాంశమౌతోంది.

2012 బ్యాచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఏపీకి అలాట్ చేసింది డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. పలు జిల్లాల్లో పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశారు.
కృష్ణా, ప్రకాశం, నెల్లూరు వంటి పలు జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. ఆయా జిల్లాల్లో సింహస్వప్నంగా నిలిచారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఎలాంటి ఒత్తిళ్లకు తల వంచడనే గుర్తింపును తెచ్చుకున్నారు.
స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నట్లు సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. ఇటీవలే ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా చేయాలనేది తన నిర్ణయం వ్యక్తిగత నిర్ణయమేనని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తేల్చి చెప్పారు. కుటుంబానికి కొంత సమయాన్ని, ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రాజకీయ వేధింపులు లేదా.. ఇతరుల బలవంతం కారణంగా ఐపీఎస్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ వెలువడుతున్న వార్తలను సిద్ధార్థ్ కౌశల్ తోసిపుచ్చారు. అవి ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. ఆ ప్రచారాన్ని- నిరాధారమైనవిగా, తప్పుదారి పట్టించేవిగా అభివర్ణించారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
ఏపీలో పని చేయడం.. అత్యంత సంతృప్తిని ఇచ్చిందని సిద్ధార్థ్ కౌశల్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎల్లప్పుడూ తనకు సొంత ఇల్లు వంటిదని, ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని అన్నారు. సుదీర్ఘకాలం సర్వీసు ఉన్నప్పటికీ- ఐపీఎస్ కు అర్ధాంతరంగా గుడ్ బై చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications