వెంటనే తొలిగించండి - కలెక్టర్లకు సీఈఓ ఆదేశాలు..!!

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోడ్ ఎక్కడా ఎవరూ ఉల్లంఘించకుండా కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల ఆదేశించింది. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా నిర్దేశించారు. ఇంకా విధులో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కీలక ఆదేశాలు
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోను, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హార్డింగులను తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షతమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు.

AP CEO Meena asks Collectors to implement poll code strictly

వాటిని తొలిగించండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్ప నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోను మరియు 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని జిల్లాలకు సంబందించి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు ఇప్పటి వరకూ తమకు అందకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సమగ్ర స్థాయిలో రూపొందించలేక పోయామనే విషయాన్ని సంబందిత జిల్లాల ఎన్నికల అధికారులు గుర్తించాలన్నాఠు.

వెంటనే నివేదికలు ఇవ్వండి
నేటి సాయంత్రం లోపు తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణా ప్రణాళికలను పంపాలని ఆదేశించారు. సి-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబందించి వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోమ్ శాఖకు పంపాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+