Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్షణం వృధా చేయని చంద్రబాబు..!!

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రావడం ఇది రెండోసారి. ఇదవరకు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఢిల్లీకి వచ్చారు. కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు అప్పట్లో.

ఇప్పుడు తాజాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు చంద్రబాబు. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌కు చేరుకున్నారాయన. నీతి ఆయోగ్ సమావేశం కాబోతోన్నది ఇక్కడే. దీనికి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. కల్చరల్ భవన్‌కు చేరుకుంటోన్న సమయంలో కారులో కొన్ని డాక్యుమెంట్లను అధ్యయనం చేయడం కనిపించింది.

AP CM Chandrababu Naidu attend the NITI Aayog meeting

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబుతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రులు భజన్‌లాల్ శర్మ- రాజస్థాన్, హిమంత బిశ్వ శర్మ- అస్సాం, భూపేంద్ర పటేల్- గుజరాత్, నితీష్ కుమార్- బిహార్, మోహన్ యాదవ్- మధ్యప్రదేశ్, విష్ణు దేవ్ సాయ్- ఛత్తీస్‌గఢ్.. ఇందులో పాల్గొన్నారు.

ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా భాగస్వామ్యపక్షాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమే ఈ కూటమి నుంచి హాజరయ్యారు. ఈ సమావేశం వేదికగా.. రాష్ట్రం, దేశ ప్రజల గొంతుకను వినిపిస్తానని అన్నారు.

AP CM Chandrababu Naidu attend the NITI Aayog meeting

విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వార్షిక బడ్జెట్‌లో వివక్ష చూపించారనే కారణంతో దీన్ని బాయ్‌కాట్ చేస్తోన్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీ హాజరు కాలేదు. నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్ చేసినట్లు వెల్లడించారాయన. సిద్దరామయ్య- కర్ణాటక, ఎంకే స్టాలిన్- తమిళనాడు, పినరయి విజయన్- కేరళ.. ఈ సమావేశానికి దూరం అయ్యారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నుంచి ఎవరూ కూడా నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+