Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'అమరావతి'కి రామోజీ రీసెర్చ్, లండన్‌లో భయపడ్డారు: బాబుకు 'శాతకర్ణి' సవాల్!

నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ సూచించారని, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా దర్శకులు క్రిష్, హీరో బాలకృష్ణలు అద్భుత సినిమా తీసి తన ముందు అంతకు మించిన రాజధాని నిర్మించే బాధ్యత

విజయవాడ: నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ రావు సూచించారని, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా దర్శకులు క్రిష్, హీరో బాలకృష్ణలు అద్భుత సినిమా తీసి తన ముందు అంతకు మించిన రాజధాని నిర్మించే బాధ్యత తన పైన పెట్టారని, ఇది తనకు సవాల్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

సోమవారం నాడు గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో విడుదలయింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి పేరు సూచించిన అంశం నుంచి విభజన, తెలుగు వారి చరిత్ర తదితర పలు అంశాలపై మాట్లాడారు.

రామోజీ రావు రీసెర్చ్ చేసి చెప్పారు

రామోజీ రావు రీసెర్చ్ చేసి చెప్పారు

విభజన తర్వాత రాజధానికి అమరావతి పేరు పెట్టామన్నారు. ఆ రోజు రామోజీ రావు గారు రీసెర్చ్ చేసి, రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని తనకు ప్రతిపాదన పంపించారని చెప్పారు. చాలామంది అమరావతి పేరు చెప్పగానే ఏకగ్రీవంగా అంగీకరించారన్నారు.

మిగతా విషయాల్లో విభేదాలు ఉన్నాయేమో కానీ, రాజధాని పేరు అమరావతి విషయంలో మాత్రం ఎక్కడా విభేదాలు రాలేదన్నారు. తెలుగు వారి చరిత్ర మళ్లీ అమరావతి పేరుతో తెరపైకి వచ్చిందన్నారు.

చరిత్రను ఆలోచించలేదు

చరిత్రను ఆలోచించలేదు

మా తెలుగు తల్లి గీతంలో కూడా అమరావతి ఉందన్నారు. కానీ మనం తెలుగువారి చరిత్రను మాత్రం ఎప్పుడు ఆలోచించలేదన్నారు. స్వాతంత్రం రాకముందు మనం చెన్నైతో కలిసి ఉన్నామని, పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏపీ ఏర్పడిందన్నారు.

అరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను వదిలేశాం

అరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను వదిలేశాం

ఆ తర్వాత ఏపీ ఏర్పడగా హైదరాబాద్ వెళ్లామని, అరవై ఏళ్లు కలిసి ఉన్నామని, ఇప్పుడు అమరావతికి వచ్చామన్నారు. కొన్ని అనుకోకుండా జరుగుతాయన్నారు. కొన్ని సందర్భాలలో చరిత్రకారులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందన్నారు.

నన్ను చూసి లండన్‌లో భయపడ్డారు

నన్ను చూసి లండన్‌లో భయపడ్డారు

తాను లండన్ గ్యాలరీకి వెళ్లినప్పుడు గ్రీస్ గ్యాలరీ, అమరావతి గ్యాలరీ మాత్రమే ఉన్నాయన్నారు. నేను అక్కడకు వెళ్లినప్పుడు వారు భయపడ్డారన్నారు. నేను మొత్తం గ్యాలరీ ఇవ్వమని అడుగుతారేమోనని భయపడ్డారని, కానీ తాను మొదట చూడాలని, చెప్పానని, చూసిన తర్వాతనే అడుగుతామని చెప్పగా, వారు మొత్తం చూపించారన్నారు.

క్రిష్ అమరావతి పైన రీసెర్చ్ చేసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేశారని, ఆయనకు అందరు అభినందనలు తెలియాలన్నారు. చాలామంది నాయకులు ఉన్నారని, రాజులు వచ్చారని, కానీ గౌతమీపుత్ర శాతకర్ణిని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.

తల్లి పేరు పెట్టుకున్న శాతకర్ణి

తల్లి పేరు పెట్టుకున్న శాతకర్ణి

మొట్టమొదటిసారి తల్లి పేరు పెట్టుకున్న రాజు శాతకర్ణి అన్నారు. తల్లికి, మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పిన వ్యక్తి శాతకర్ణి అన్నారు. అది నూతన విప్లవం అన్నారు.

శాతవాహనలు 400 సంవత్సరాలు, 46 మంది పాలించారన్నారు. 23వ రాజు శాతకర్ణి అన్నారు. వారు పవర్ ఫుల్‌గా పరిపాలించారన్నారు. అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, అమరావతి నుంచి పాలించిన వ్యక్తి శాతకర్ణి అన్నారు.

ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు

ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు

తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారన్నారు. తెలుగుబిడ్డగా పుట్టి, రాజకీయాల్లోకి వచ్చి, టిడిపిని పెట్టడమే కాకుండా జాతీయస్థాయిలోని నిరంతరం పోరాడారన్నారు. కాంగ్రెసేతర పక్షాలను కలిపారన్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి వీపీ సింగ్‌ను ప్రధాని చేశారని, ఆ తర్వాత చాలామంది వచ్చారని, ఆ ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు.

శాలివాహనం శకం

శాలివాహనం శకం

మరో విషయం ఏమంటే ఏసు ప్రభువు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రపంచంలో ప్రారంభమైందన్నారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నారు. ఆ తర్వాత డెబ్బై ఏళ్లకు మనకు శాలివాహన శకం ప్రారంభమైందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్నాటక, మహారాష్ట్ర, మారిషస్, బాలిలలో ఉగాది జరుపుకుంటామన్నారు.

నా ముందు అతి పెద్ద సవాల్ పెట్టారు

నా ముందు అతి పెద్ద సవాల్ పెట్టారు

బాలకృష్ణ, క్రిష్ సినిమాను బ్రహ్మాండంగా తీశారని, కానీ ఇప్పుడు తన ముందు అతి పెద్ద సవాల్ ఉందన్నారు. వారి సినిమా కంటే మించిన రాజధానిని కట్టాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు. దేశంలో నెంబర్ వన్, ప్రపంచంలోని ఐదు పెద్ద రాజధానుల్లో అమరావతి ఉండాలనేది తన లక్ష్యమన్నారు. తాను అప్పుడప్పుడు వెళ్తుంటానని, కానీ వెంకయ్య ఎప్పుడు సినిమా ఫంక్షన్‌కు రారని, ఇప్పుడు వచ్చారన్నారు. ఏపీ అంటే ఎనలైని అభిమానం ఉన్న వ్యక్తి వెంకయ్య అన్నారు.

ఈ రోజు వెంకయ్య, నేను ఢిల్లీ నుంచి వచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్నారు. అలాంటి జీవనాడికి నాబార్డు సాంక్షన్ చేసిన రోజు ఈ రోజు అన్నారు. కేంద్రం మొదటి విడత చెక్కు ఇచ్చిందన్నారు.

అమరావతి వాస్తు బలం బ్రహ్మాండం

అమరావతి వాస్తు బలం బ్రహ్మాండం

అమరావతికి వెళ్లినప్పటి నుంచి వాస్తుబలం బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆ పేరు పెట్టుకున్న ఈ సినిమా కూడా వెయ్యి రోజులు ఆడుతుందని, అంతకంటే ఎక్కువ ఆడుతుందని బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. క్రిష్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారన్నారు. ఆయన కసిగా ఈ సినిమా తీశాడన్నారు. ఆయన చేసినది ఓ పవిత్ర కార్యమని, జయప్రదం అవుతుందన్నారు.

డబ్బులకు కొదువ లేదు

డబ్బులకు కొదువ లేదు

అమరావతి పేరుతో సినిమా తీసినందున ఈ సినిమా నిర్మాతలకు డబ్బులకు కొదువ లేదని, మరో రెండు మూడు సినిమాలు తీసేందుకు కూడా వారికి డబ్బులు వస్తాయన్నారు. వారికి కచ్చితంగా బాగా డబ్బులు వస్తాయన్నారు. సినిమాలు అవసరమని, కానీ మంచి సినిమాలు కావాలన్నారు.

కొన్ని సినిమాలు చూస్తే నిద్ర రాని పరిస్థితి, భయపడే పరిస్థితి ఉంటుందన్నారు. మరిన్ని సినిమాలు చూస్తే మానసిక వికాసం, ఆనందం, వినోదం ఉంటుందన్నారు. అలాంటి సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు. ఈ సినిమా చూసి అందరూ తెలుగు జాతిని గుర్తుకు పెట్టుకునేలా ఉండాలన్నారు.

రెండు విషయాల్లో ఆనందం

రెండు విషయాల్లో ఆనందం

తాను రెండు విషయాల్లో ఆనందంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఒకటి మోడీ సహకారంతో పోలవరం ప్రాజెక్టు నెరవేరుతుందన్నారు. వెంకయ్య, ఉమా భారతి, అరుణ్ జైట్లీలు సహకరించారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాయలసీమలో కరువు ఉండదన్నారు. అలా చేసి తీరుతామన్నారు.

ఎన్నో ఏళ్లుగా కరువుతో బాధపడుతున్న రాయలసీమ, నెల్లూరు వంటి జిల్లాలకు పోలవరం ద్వారా నీటిని ఇవ్వవచ్చునన్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులు మంజూరు అయ్యాయన్నారు.

శాతకర్ణి ఆనందం

శాతకర్ణి ఆనందం

రెండోది.. అమరావతి, తెలుగువారి చరిత్ర చాటి చెప్పే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో విడుదల కావడం మరో సంతోషమన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే తెలుగువారికి తిరుగు ఉండదని చంద్రబాబు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+