వైఎస్ జగన్ 'సర్వతో భద్ర వ్యూహం'

మహాభారతంలో సర్వతో భద్ర వ్యూహం అత్యంత ముఖ్యమైంది. ఈ వ్యూహాన్ని రూపొందించిన భీష్ముడి ప్రతాపాన్ని తట్టుకోలేకపోయారు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. సరిగ్గా అటువంటి వ్యూహానే ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రెండోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అలా జరిగితే 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటామని శ్రేణులకు తెలియజేస్తున్నారు. అవసరమైతే కఠినచర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడనని నాయకులకు స్పష్టం చేస్తున్నారు.

 రాజకీయాలకు అతీతమైన బంధం

రాజకీయాలకు అతీతమైన బంధం


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరమైన సమయంలో వైసీపీ మద్దతు తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో మతతత్వ పార్టీగా తన పార్టీని ప్రచారం చేసే అవకాశం ఉందని జగన్ గ్రహించారు. దీనికి విరుగుడుగా ప్రధానమంత్రి పాల్గొన్న సభలోనే తమది రాజకీయాలకు అతీతమైన బంధమని పేర్కొన్నారు. ఒకరకంగా ఆ వేదికపై నుంచి కేంద్రంతో తమకు ఎటువంటి సంబంధం లేదనే సంకేతాలను పంపించగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 రాష్ట్ర ప్రయోజనాల కోసమే..

రాష్ట్ర ప్రయోజనాల కోసమే..


అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో బంధాన్ని కొనసాగిస్తున్నామని జగన్ చెప్పారు. వైసీపీ బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తోందనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తే దాన్ని ఎలా తిప్పకొట్టాలో అధిష్టానం పార్టీ శ్రేణులకు సూచించింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ బీజేపీతో స్నేహం కోసం పరితపిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పవన్ కల్యాణ్ సైతం టీడీపీతో వెళ్లేందుకు ఒప్పుకోవడంలేదంటూ వార్తలు వస్తున్నాయి.

 వైసీపీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి

వైసీపీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి


ఒకవేళ రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీని దూరం పెడితే వైసీపీపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. మతతత్వ పార్టీతో పొత్తు అనే విషయాన్ని ప్రజల్లోకి అంతర్లీనంగా తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిసి అప్రమత్తమయ్యారు. ఈ మూడు పార్టీలు కలిసినా ఒకరకంగా వైసీపీ మంచికేనని తలపోస్తున్నారు. టీడీపీ-జనసేన బీజేపీతో కలిసే ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని, తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారంటూ ప్రచారం చేసే అవకాశం ఉంది. రేపటి ఎన్నికల్లోపు పరిణామాలు ఎటువంటి మలుపులు తిరిగినా వాటిని తట్టుకునేలా అన్నిరకాలుగా వ్యూహాలను జగన్ సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+