Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాల వేగం పెంచింది. తాజాగా పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును ఆమోదించారు. ఇక.. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అమరావతి స్థానంలో మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదన చేసారు. రాజకీయంగా ఈ ప్రతిపాదన పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక.. ఈ సమయంలోనే సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని ప్రాంతాల పైన కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఈ ప్రాంతాన్ని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా విభజించింది. మొత్తం 8,352.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని భౌగోళిక పరిస్థితులు ఇంకా అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వర్గీకరించారు. ఇందు లో భాగంగా రాజధాని అమరావతి నగరం - విజయవాడ నగరాలను సెంట్రల్ జోన్ పరిధి లోకి తీసుకువచ్చారు. సెంట్రల్ జోన్ : రాజధానికి గుండెకాయ వంటి ఈ జోన్‌లో ప్రధాన నగరాలు మరియు కీలక మండలాలు ఉన్నాయి. ఇందులో అమరావతి రాజధాని నగరం (217 చ.కి.మీ), విజయవాడ నగరం ఉంటాయి. వెస్ట్రన్ జోన్: రాజధానికి పశ్చిమ దిశలో ఉన్న కృష్ణా మరియు ఎన్.టీ.ఆర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. నార్తర్న్ జోన్: ఉత్తర దిశలో ఉన్న మైలవరం, నూజివీడు వంటి ప్రాంతాలను ఈ జోన్ కిందకు చేర్చారు.

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!
ap-crda-reorganized-into-8-zones-amid-mavigun-controversy-restructuring-aligns-with-the-developmen

జోన్లు పరిధి.. భవిష్యత్ ప్రణాళిక

ఇక, నార్త్ ఈస్ట్ జోన్ : గన్నవరం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. కాగా.. ఈస్ట్రన్ జోన్: కృష్ణా జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మరియు వాణిజ్య ప్రాంతాలు ఇందులో చేర్చారు. సౌత్ వెస్ట్ జోన్ : పల్నాడు మరియు గుంటూరు జిల్లాలకు చెందిన కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. సదరన్ జోన్ : గుంటూరు నగరంతో సహా చుట్టుపక్కల ప్రాంతాలను ఈ జోన్‌గా పరిధి లో కి తీసుకొచ్చారు. సౌత్ ఈస్ట్ జోన్ : బాపట్ల మరియు గుంటూరు జిల్లాల పరిధిలోని డెల్టా ప్రాంతా లు ఇందులో ఉన్నాయి. కాగా.. సీఆర్డీఏ పరిధి 8,352.69 చదరపు కిలోమీటర్లు. అమరావతి నగరం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ జోన్ల విభజన గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ విభజన ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం సులభతరం కావడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణీకరణ ప్రక్రియ వేగవంతం చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+