ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం!

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖ పర్యటన జోరుగా సాగింది. ప్రధాని మోదీ రోడ్ షో కి ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. సిరిపురం జంక్షన్ నుండి ఆంధ్రా యూనివర్సిటీ వరకు రోడ్ షో నిర్వహించారు.

అంధకారంలో ఉన్న రాష్ట్రానికి వెలుగులు తెచ్చిన మోదీ: పవన్ కళ్యాణ్
అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మోదీని ఉద్దేశించి ప్రసంగించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురిపించారు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ వెలుగులు నింపారని ఆయన పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని కితాబిచ్చారు.

ap deputry cm pawan kalyan prised pm modi support for andhrapradesh development

సదాశయంతో బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపిన ప్రధాని మోదీకి అండగా ఉంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్ గా మారుతుందని, సదాశయంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిస్తే అది స్వచ్చ భారత్ అవుతుందని, సదుద్దేశం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ఆ సదాశయమే బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేసేలా చేస్తుందన్నారు.

అభివృద్ధి అంటే ఆంధ్ర అనే లాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
ఆత్మ నిర్భర్ భారత్, స్వచ్చ భారత్ నినాదాలతో మోదీ ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఏపీ లో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించడంలో మోదీ విజయాన్ని సాధించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల అరాచక పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి అంటే ఆంధ్ర అనే లాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

మోదీ నిధులిస్తేనే మారుమూల గ్రామాలకు రోడ్లు
మోదీ సర్కార్ నిధులు ఇవ్వడంతోనే మారుమూల గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు వేయగలుగుతున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుక పడకూడదని ఆయన అన్నారు. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో ఏడు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోడీ సంకల్పానికి ఆయన అందిస్తున్న సహకారానికి తన వంతుగా కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+