జనసేనాని ఎక్కడ..? వరదల సమయంలో కనిపించని ఏపీ డిప్యూటీ సీఎం

భారీ వర్షాలు,వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై ఈ గట్టిగానే పడింది. రెండ్రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. భారీ వర్షాలు కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.

విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి.రెండు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.

AP Deputy CM Pawan Kalyan was not seen during the floods

దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు..బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉద్ధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. అయితే ఇటువంటి సమయంలో జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా సోమవారం నాడు, ఆయన బయట కనిపించింది లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా..? విదేశాలకు వెళ్లారా ..? అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే భారీ వరదల కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.ఇక పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా రీ-రిలీజ్ చేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+