వైసీపీ- టీడీపీ సై అంటే సై
AP Assembly election 2024: కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ పరిధిలోని జనరల్ సీటు ఇది. కనిగిరి, హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, పామూరు, వెలిగండ్ల, పెద్ద చెర్లోపల్లి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే- రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉంటుందీ కనిగిరి అసెంబ్లీ పరిధిలో.
ఆ తరువాత యాదవులు, కాపు, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఇక్కడి నుంచి ఎక్కవసార్లు ఎన్నికయ్యారు. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలను నిర్వహించగా..తొమ్మిది సార్లు రెడ్డి అభ్యర్థులే విజయం సాధించారిక్కడ.

తెలుగుదేశం ఆవిర్భవించిన అనంతరం 2019 వరకు తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ముక్కు కాశిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నాయుడు మూడుసార్లు చొప్పున విజయం సాధించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. 2014లో టీడీపీ పాగా వేసింది. నందమూరి బాలకృష్ణ ఆప్తుడు కదిరి బాబూరావు విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కనిగిరి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. ఆ పార్టీ తరఫున బీసీ నేత బుర్రా మధుసూదన్ యాదవ్.. భారీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై 40 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా.. బీసీ అభ్యర్థిని బరిలో దించడం వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ అయింది.

రెడ్డి- యాదవ సామాజిక వర్గ ఓటుబ్యాంకును ఆకర్షించడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. జనసేనతో పొత్తు పెట్టుకుని కనిగిరి నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్ధి మన్నేపల్లి లక్ష్మీ నారాయణకు 2,434 ఓట్లు, బీజేపీకి 1,177 ఓట్లు పోల్ అయ్యాయి.
2024 ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ అభ్యర్థినే రంగంలో దించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ తరఫున ఉగ్ర నరసింహా రెడ్డికే టికెట్ ఇస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications