ఏపీలో ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై తేల్చేసిన సర్కార్..! అసెంబ్లీలో క్లారిటీ..!

ఏపీలో ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ కమిషనర్ నియామకంతో పాటు పలు కీలక అంశాలపై ఉద్యోగులు కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దసరాకు కనీసం రెండు డీఏలు అయినా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కూడా కోరారు. అయినా ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి స్పందనా లేదు. ఈ తరుణంలో ఆసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా పంపిన ప్రశ్నకు ఆర్థికమంత్రి పయ్యావుల స్పష్టత ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపత్రి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బుసినే విరూపాక్షి ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్లపై నాలుగు ప్రశ్నలు పంపారు. వీటికి ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నుంచి స్పష్టత కోరారు. వీటిలో ప్రభుత్వం ఎప్పటికల్లా పీఆర్సీని నియమిస్తుందని, ఎప్పటికల్లా వేతన సవరణ చేస్తుందని అడిగారు. అలాగే ఉద్యోగులకు తాత్కాలిక భృతి (ఐఆర్) ఎంత ఇస్తున్నారని, అలాగే ఎప్పటికల్లా ఇస్తారని అడిగారు. చివరిగా మొత్తం డీఏ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని అడిగారు.

AP Finance Minister Clarifies Status of DA PRC Arrears for Employees in Assembly

వీటికి సమాధానంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. పీఆర్సీ నియామకం, వేతన సవరణ, తాత్కాలిక భృతి మొత్తం, ఎప్పటిలోగా చెల్లించాలన్నది ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. అలాగే చివరి ప్రశ్న అయిన డీఏ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని అడిగిన దానికి మాత్రం కాస్త వివరంగా సమాచారం ఇచ్చారు. ఇందులో ఆయన గతేడాది జూన్ 12 నాటికి 11వ పీఆర్సీ బకాయిలతో కలిపి మొత్తం డీఏ బకాయిలు రూ.12, 119.77 కోట్లు ఉన్నాయని, వీటిని ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగులకు చెల్లిస్తామని మాత్రం తెలిపారు.

AP Finance Minister Clarifies Status of DA PRC Arrears for Employees in Assembly

మరోవైపు ఇవాళ ఏపీ జేఏసీ ఉద్యోగులు సమావేశమై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం దసరా లోపు కనీసం రెండు డీఏ బకాయిలు అయినా చెల్లించాలని, అలాగే పీఆర్సీ కమిషనర్ నియామకం చేపట్టాలని కోరారు. వీటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండిపోతే మాత్రం తాము తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+