AP DSC Notification: 2,721పోస్టులతో షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్. జిల్లాల వారీగా లిస్ట్

ఏపీలోని నిరుద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ ప్రకటిస్తామన్న హామీకి కట్టుబడి, కొత్తగా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ను మంగళవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. నిజానికి ఈ నెల 15న షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో రెండు రోజుల ముందే ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తెచ్చింది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు

మొత్తం భర్తీ చేయనున్న 2,721 ఖాళీలను మూడు ప్రధాన విభాగాలుగా విభజించి నోటిఫికేషన్లు జారీ చేశారు.

AP Government Releases Brief DSC 2026 Notification for Recruitment of 2 721 Teacher Vacancies
  • సాధారణ పాఠశాలలు: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 2,111 టీచర్ పోస్టులు ఉన్నాయి.
  • స్పెషల్ ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం 350 టీచర్ పోస్టులను కేటాయించారు.
  • సంక్షేమ సొసైటీలు: వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరీల్లో 260 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
టీచర్ల నియామకాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! ఏపీలో డీఎస్సీ వివాదం వేళ..!
టీచర్ల నియామకాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! ఏపీలో డీఎస్సీ వివాదం వేళ..!

సంక్షేమ గురుకులాలు, సొసైటీల్లో ఉన్న పోస్టులు

సంక్షేమ గురుకులాల్లోని 260 పోస్టుల విభజన ఇలా ఉంది:

  • ఏపీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్ (సాంఘిక సంక్షేమం): ప్రిన్సిపల్ 21, పీజీటీ 45, పీఈటీ 19 కలిపి మొత్తం 85 పోస్టులు ఉన్నాయి.
  • ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (గిరిజన సంక్షేమం): పీజీటీ 6, టీజీటీ 27, పీడీ 1, పీఈటీ 2 కలిపి 36 ఖాళీలు ఉన్నాయి.
  • ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (బీసీ సంక్షేమం): ప్రిన్సిపల్ 3, పీజీటీ 10, టీజీటీ 24 పోస్టులతో మొత్తం 37 ఉన్నాయి.
  • ఏపీఆర్‌ఈఐఎస్ (జనరల్ గురుకులాలు): ప్రిన్సిపల్ 4, పీజీటీ 20, టీజీటీ 32, పీడీ 1, పీఈటీ 11 కలిపి 68 ఖాళీలు ఉన్నాయి.
  • ఏపీ మోడల్ స్కూల్స్: ప్రిన్సిపల్ 2, టీజీటీ 17 పోస్టులతో 19 ఖాళీలు ఉన్నాయి.
  • మహిళా శిశు సంక్షేమ విభాగం: టీజీటీ 13, పీఈటీ 2 కలిపి 15 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీలు.. కర్నూలులోనే అత్యధికం!

ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులో కర్నూలు జిల్లా అత్యధిక ఖాళీలతో అగ్రస్థానంలో నిలిచింది.

అత్యధిక ఖాళీలున్న జిల్లాలు:

  • కర్నూలు జిల్లాలో అత్యధికంగా 404 పోస్టులు (సాధారణ డీఎస్సీలో 389, ప్రత్యేక విద్యలో 15).
  • ప్రకాశం జిల్లాలో 291 పోస్టులు (సాధారణ 266, ప్రత్యేక విద్య 25),
  • వైఎస్సార్ కడప జిల్లాలో 227 పోస్టులు (సాధారణ 206, ప్రత్యేక విద్య 21)

తక్కువ ఖాళీలున్న జిల్లాలు:

  • విజయనగరంలో 18 పోస్టులు (సాధారణ 4, ప్రత్యేక విద్య 14), పా
  • ర్వతీపురం మన్యంలో 15 పోస్టులు (సాధారణ 8, ప్రత్యేక విద్య 7),
  • పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోస్టులు (సాధారణ 10, ప్రత్యేక విద్య 10)
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!

నవంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు

ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబరు 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు, వయోపరిమితి, విద్యార్హతలు, రిజర్వేషన్ల సమగ్ర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ప్రిన్సిపల్ పోస్టులను మల్టీ జోనల్ ప్రాతిపదికన, పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్ పరిధిలో భర్తీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+