AP holidays 2026: ఏపీలో 2026లో ప్రభుత్వ సెలవులు ఇవే..! జీవో విడుదల..!
ఏపీలో కొత్త ఏడాది 2026లో అధికారిక సెలవుల జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం మొత్తం ఏడాదిలో 21 సెలవుల్ని ఖరారు చేసింది. ఇవి కాక రెండు సెలవులు శని, ఆదివారాల్లో వచ్చాయి. వీటిని కూడా జాబితాలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ లిస్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ఏయే సెలవులు ఏయే తేదీల్లో ఇచ్చారో ఓసారి చూద్దాం..
కొత్త ఏడాదిలో జనవరి 15న మకర సంక్రాంతితో సెలవులు మొదలుకాబోతున్నాయి. జనవరి 26 ఎప్పటిలాగే రిపబ్లిక్ డే సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సెలవు, మార్చి 3న హోలీ, మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 1న వార్షిక క్లోజింగ్ డే సెలవులు ఇచ్చారు. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, 14న అంబేద్కర్ పుట్టినరోజు, మే1న మేడే, మే 27న బక్రీద్, జూన్ 25న మొహర్రం సెలవులు ఇచ్చారు.

ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 25న మిలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 14న వినాయక చవితి, అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 20న విజయ దశమి (దసరా), నవంబర్ 8న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. దీంతో సాధారణ సెలవులు ముగుస్తాయి. వీటిలో ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, నవంబర్ 8న దీపావళి ఆదివారాలు రావడంతో ప్రత్యేక సెలవులేమీ ఉండవు. వీటితో పాటు ఆప్షనల్ హాలిడేస్ అదనంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications