ఏపీలో మందుబాబుల కరవు తీరేలా..!!

Liquor Sales in Andhra Pradesh: ఏపీలో మందుబాబుల కరవు తీరుతోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అయిదు సంవత్సరాల పాటు నాణ్యమైన మద్యం, వాటి బ్రాండ్లకు ముఖం వాచిన మద్యం ప్రియులు ఇప్పుడు కసితీరా తాగేస్తోన్నారు. సీసాలను ఖాళీ చేసి పడేస్తోన్నారు.

లిక్కర్ అమ్మకాలు భారీగా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లభిస్తోండటం, పాత బ్రాండ్లు మళ్లీ మార్కెట్‌లో అందుబాటులోకి రావడంతో దుమ్ము దులుపుతున్నారు. ఫలితంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముమ్మరంగా సాగుతున్నాయి.

AP government witnesses growth in liquor sales as Rs 4677 Crore

రాష్ట్రవ్యాప్తంగా 3,300 మద్యం షాపులు

ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాల్లో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,300 మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. ఊరూరా బెల్ట్ షాప్‌లు సైతం వెలిశాయి. మందుబాబులు కోరిన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఏకంగా 4,677 కోట్ల రూపాయల మేర..

ఈ నేపథ్యంలో- అక్టోబర్ 16 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. ఏకంగా 4,677 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెలన్నర రోజుల వ్యవధిలో 61.63 లక్షల కేసుల మందు, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తిరుపతి జిల్లాకు అత్యధికంగా

ప్రత్యేకించి- తిరుపతి జిల్లాకు అత్యధికంగా మద్యం దుకాణాలను కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఒక్క తిరుపతి జిల్లాకు అత్యధికంగా 227 మద్యం షాపులను మంజూరు చేసింది.

జిల్లాల్లో..

శ్రీకాకుళం- 158, విజయనగరం- 153, పార్వతీపురం మన్యం- 52, అల్లూరి సీతారామరాజు- 40, విశాఖపట్నం- 155, అనకాపల్లి- 136, కాకినాడ- 155, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- 133, తూర్పు గోదావరి- 125, పశ్చిమ గోదావరి- 175, ఏలూరు- 144 మద్యం దుకాణాలను కేటాయించింది.

అనంతలో..

క‌ృష్ణా- 123, ఎన్టీఆర్- 113, గుంటూరు- 127, బాపట్ల- 117, పల్నాడు- 129, ప్రకాశం- 171, నెల్లూరు- 182, కర్నూలు- 99, నంద్యాల- 105, అనంతపురం- 136, శ్రీసత్యసాయి పుట్టపర్తి- 87, కడప- 139, అన్నమయ్య రాయచోటి- 111, చిత్తూరు- 104 మద్యం షాపులు దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+