ఏపీలో ఈ ఏడాది పాఠశాలల పనిదినాలు, పండుగల సెలవులు ఇలా..!!

ఏపీ ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బడుల నిర్వహణ... ఉపాధ్యాయుల సర్దు బాటు పైన కార్యాచరణ సిద్దం చేసింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలు పెట్టారు. ఇక, జూన్ 12న వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో, ప్రభుత్వం 2025-26 వార్షిక విద్యా క్యాలెండర్ ను ప్రకటించింది. పని దినాలతో పాటుగా సెలవులను వెల్లడించింది. ఇక, ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం 2025-26 అకడమిక్ క్యాలెండర్ ప్రకటించింది. అందు లో భాగంగా మొత్తం వచ్చే విద్యా సంవత్సరంలో 263 రోజులు పని దినాలుగా పేర్కొంది. 1-5 తరగతులకు ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఖరారు చేసారు. మైనార్టీ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు.. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి.

ap-govt-announce-academic-for-the-year-2025-26-details-here

కాగా, పాఠశాలల్లో మార్పుల పై ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరఫున చర్చలు ఫలించినట్లు వారు ప్రకటిం చారు. ఎస్‌జీటీలకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పకుందని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 49 దాటిన తరువాత 2వసెక్షన్ ఏర్పాటు చేసేందుకు సర్కార్ అంగీకరించింది. ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తామని.. ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరం మేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్, సర్‌ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+