Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ - ఎవరికి ఏ పదవి, లిస్టులో..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతలకు రాష్ట్ర స్థాయి పదవుల ను కేటాయించింది. 31 పదవులు భర్తీ చేస్తూ లిస్ట్ విడుదల చేసారు. అందులో సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేసారు. ఓసి - 6, బీసీ - 17, ఎస్సి - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 చొప్పున పదవు లను కేటాయించారు. ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు.

తాజాగా విడుదల చేసిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఆకేపోగు ప్రభాకర్ - కొడుమూరు (SC) - టిడిపి నేతకు కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు - బల కొట్టయ్య - నందిగామ (SC) - బహుజన JAC నేతకు ఖరారు చేసారు. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ - బ్రహ్మం చౌదరి - గురజాల - టిడిపి ని నియమించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ - బుచ్చి రామ్ ప్రసాద్ - గుంటూరు వెస్ట్ - టిడిపికి చెందిన నేతకు దక్కింది. ఇక.. ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - సి. ఎస్. త్యాగరాజన్ - చిత్తూరు జిల్లా టీడీపీ నేతకు ఖరారు చేసారు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - డి. విక్రమ్ సింగ్ - కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీకి నేతకు ప్రకటించారు.

ap-govt-announces-31-state-level-nominates-posts-for-three-parties-leaders

అదే విధంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) - దాసరి శ్రీనివాసులు - తిరుపతికి చెందిన బీజేపీ నేతకు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ - గుంటసల వెంకట లక్ష్మి - డెందులూరు - జెఎస్పి కి దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ఆరెకటిక / కటిక / ఆరే- సూర్యవంశీ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - హరికృష్ణరావు హనుమంతకరి - తాడిపత్రి - టిడిపి పేరు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - కమ్మరి పార్వతి - పాణ్యం- టిడిపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - లక్ష్మీనారాయణ - మడకశిర (SC) - టిడిపికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - మరుపిల్ల తిరుమలేశ్వరరావు - విజయవాడ వెస్ట్ - టిడిపికి అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల - ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - నాగేశ్వర నాయుడు కందూరి - రాయచోటీ - టిడిపి కి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్బాష / దుదేకుల కార్పొరేషన్ - నాగుల్ మీరా కాసునూరి - విజయవాడ వెస్ట్ - టిడిపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల, పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - నరసింహులు దామోదర - నరసన్నపేట - టిడిపికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ వికలాంగులు మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ - నారాయణ స్వామి - రాప్తాడు - టిడిపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు - పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి - కోవూరు - టిడిపికి ప్రకటించారు. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ - ప్రకాశ్ నాయుడు - సింగనమల (SC) - టిడిపికి కేటాయించారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ - ఆర్. డి. విల్సన్ - నెల్లూరు సిటీ - బిజెపికి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - ఆర్. వెంకటరమణప్ప - పెనుకొండ - టిడిపికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - రామనారాయణ రావు ఎరుబోతు- విజయవాడ సెంట్రల్ - టిడిపికి దక్కింది. ఇక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కోమటి/ కాళింగ వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - రమేష్ మొదలవలస- ఆమదాలవలస - టిడిపికి దక్కింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ - రవి మందలపు- రాజమండ్రి సిటీ - టిడిపికి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ - రెడ్డి అనంత కుమారి - కొత్తపేట- టిడిపికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ బెస్తా సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ - శ్రీధర్ బొమ్మన - సుల్లూరుపేట (SC) - టిడిపికి కేటాయించారు.

వీటితో పాటుగా ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (OUDA) - షేక్ రియాజ్ - ఒంగోలు - జెఎస్పికి ప్రకటించారు. జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ - శ్రీ వంపూరు గంగులయ్య - పాడేరు (ST) - జెఎస్పికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - స్వప్న - అనంతపూర్ అర్బన్ - టిడిపికి దక్కింది. ఇక.. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ / పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ - త్రిమూర్తులు గంట - భీమవరం - టిడిపికి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - వి. చంద్రశేఖర్ - పీలేరు - టిడిపికి కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం - వెంకట రత్నాజీ పొత్నూరు - శృంగవరపుకోట - టిడిపికి దక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+