స్త్రీ శక్తి పథం వేళ APSRTC పై చంద్రబాబు మార్క్ నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఎంటీ కృష్ణబాబు ఉన్నారు. కాగా, ఆయన స్థానంలో మార్పు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో అనేక బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యం ను ఆర్టీసీ వైస్ ఛైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఏపీ ప్రభుత్వం కీలక నియామకం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు. ఎంపిక చేసిన కేటగిరీల్లో ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రభుత్వం సైతం ఈ పథకం అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తున్న స్పెషల్ బస్సుల్లోనూ ఈ పథకం కొనసాగిస్తోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. ఈ పథకం అమలు వేళ వెలుగులోకి వస్తున్న కొన్ని సమస్యలను పరిష్కారం దిశగా ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ పథకం మరింత పక్కాగా అమలు చేసేందుకు తాజాగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆర్టీపీ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
కాగా, ఇదే సమయంలో ఆర్టీసీ బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ బాల సుబ్రమణ్యం కు ప్రభుత్వం అప్పగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమల రావు ఈ బాధ్యతలను పర్యవేక్షించారు. తరువాత తాత్కాలికంగా ఐఏఎస్ అధికారి ఎంటీ క్రిష్ణబాబుకు ఈ బాధ్యతలను కేటాయించారు. ఇక.. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బాలసుబ్రమణ్యం కు ఆర్టీసీ ప్రజారవాణాతో పాటుగా ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్ - ఎండీ గా బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. బాల సుబ్రమణ్యం 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖ పర్యవేక్షించారు. ఇక.. పోలీసు అధికారిగా పలు హోదాల్లో అనేక ప్రాంతాల్లో పని చేసారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజా రవాణ వ్యవస్థ ను కీలకంగా భావించటం తో పాటుగా ఉచిత బస్సు పథకం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో ఏరి కోరి బాలసుబ్రమణ్యం కు ఈ బాధ్యతలు కేటాయించారు. దీంతో, త్వరలోనే బాల సుబ్రమణ్యం తాజా ఉత్తర్వుల మేరకు బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications