సచివాలయాల్లో ఆ సిబ్బంది సేవల్లో మార్పులు..!!

ఏపీ ప్రభుత్వం సచివాలయాల క్రమబద్దీకరణకు నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఏర్పాటు అయిన ఈ సచివాలయాల నిర్వహణ పైన తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. వాలంటీర్లను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీతో పాటుగా ఇతర విధులను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో సచివాలయంలో పని చేసే కొన్ని విభాగాల ఉద్యోగుల విధులు.. వారి అవసరం పైన ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. అందులో భాగంగా మహిళా పోలీసుల విషయంలో ప్రభుత్వం తాజాగా కసరత్తు మొదలు పెట్టింది.

ప్రభుత్వం కసరత్తు
వైసీపీ హయాంలో ఏర్పాటైన వార్డు - గ్రామ సచివాలయాల ఉద్యోగుల విధుల పైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సచివాలయాల క్రమబద్దీకరణ పైన మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయంలో పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో వారిని సచివాలయాల పరిధిలో శిశు సంక్షేమ విధుల కోసం తీసుకున్న ఉద్యోగుల విషయంలో తాజాగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరికి యూనిఫాం ఇచ్చి పోలీసు డ్యూటీ చేయమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఎటాచ్‌ చేసారు.

AP Govt begin Exercise to change the duties for Women police in Ward and village secretariats

మంత్రుల చర్చ
నాటి ప్రభుత్వ నిర్ణయం పైన పులువురు తమ నియామకానికీ, చేస్తున్న విధులకూ పొంతన లేదని కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు వారి సేవలను ఎలా వినియోగం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై తాజాగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఇరు శాఖల అధికారులు చర్చించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వారిని తీసుకురావాలని యోచించారు. ఒకవేళ మహిళా పోలీసులను మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురా వాలని నిర్ణయిస్తే వారికి ఎలాంటి విధులు కేటాయించాలనే దాని పైన చర్చ జరిగింది.

ప్రతిపాదనలు
దీనిపై మరోసారి కలిసి మాట్లాడుదామని, ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం తీసుకుందామని ఇరువురు మంత్రులు డిసైడ్ అయ్యారు. మహిళా శిఖు సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకుంటే వారి సేవలను వినియోగించుకోవడంపై ఆ శాఖ ప్రాథమికంగా కసరత్తు చేసింది. కొన్ని విభాగాలను, సేవలను గుర్తించింది. రాష్ట్రంలో 29 వన్‌ స్టాఫ్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్ల సంరక్షణ విధులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో మహిళా హాస్టళ్లు, శిశు గృహాలు, శక్తి సదన్లలో వీరి సేవలను వినియోగించుకునే వీలుందని సమాచారం. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే వీరి విధుల ఖరారు పైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+