ఏపీ చెల్లించాల్సిన బకాయిలివే - చంద్రబాబు వాట్ నెక్స్ట్..!!

ఏపీలో ఆర్దిక కష్టాలు వెంటాడుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్దిక అంశాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న ఆర్దిక పరిస్థితిని వివరిస్తూ ఈ నెల 26న అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. చెల్లించాల్సిన బిల్లుల విలువను అధికారులు తేల్చారు. బిల్లుల చెల్లింపు కేసులు పెద్ద సంఖ్యలో కోర్టుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్దిక నిర్వహణ పై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

ఆర్దిక ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈ నెల 26న ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితులను వివరించనున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాల తో పాటుగా కార్పోరేషన్ల ద్వారా సమీకరించిన రుణాల మొత్తాన్ని అధికారులు తేల్చారు. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు రూ.వేల కోట్లలో ఉన్నట్లు అధికారులు నివేదించారు.

AP Govt clear pedning bills of rs 1 41 lakh to release white paper on financial status

చెల్లించాల్సిన బిల్లులు
చెల్లించాల్సిన బిల్లుల్లో 93 వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులను ఇప్పటివరకు ఆర్థిక శాఖ సిఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ కూడా చేయలేదని సమాచారం. మరో 48 వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు అప్‌లోడ్‌ జరిగినప్పటికీ, చెల్లింపులు జరగలేదని ఆర్థికశాఖ తాజా అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ఎక్కువ భాగం నీటి పారుదల శాఖకు చెందినవే ఉన్నట్లు సమాచారం. పోలవరంతోపాటు ఆనేక పథకాలకు 19,324 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు పనులు ఆపివేసి వెనక్కు వెళ్లిపోయారు.

ఆ తరువాత ఆర్దిక శాఖ నుంచి చేయాల్సిన చెల్లింపులు రూ.19,549 కోట్లు, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో రూ.14 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. అలాగే పరిశ్రమల శాఖ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, సంక్షేమం వంటి అనేక శాఖల్లో కూడా భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొందరు బిల్లుల చెల్లింపుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇక, ఆర్దిక పరిస్థితిని వివరిస్తూనే..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+