ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లు మార్పు - లిస్టులో, బాలయ్య డిమాండ్ పైనా..!!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేసారు. కాగా, కూటమి నేతలు ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు .. మండలాల పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ అంశం పైన అధ్యయనం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసారు. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటు.. పేర్లు మార్పు పైన కీలక నిర్ణయాలకు రంగం సిద్దమైంది.

కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఉపసంఘం ఏర్పాటై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. దీంతో, సీఎం చంద్రబాబు నెల రోజుల్లో ఉపసంఘం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల పేర్ల మార్పు.. మండలాల ఏర్పాటు వంటి వాటితో పాటుగా డిసెంబరు నాటికి అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో పలు జిల్లాల ఏర్పాటు.. మండల కేంద్రాల మార్పు పైన పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల పైన తుది కసరత్తు చేస్తున్నారు.

ap-govt-final-exercise-over-district-re-organisation-and-mandals-in-the-state

అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి. వీటిని కమిటీ పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం గా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు రాయచోటినే కొన సాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లు ఉన్నాయి.

అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా లోని వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండ లాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే హామీలు ఉన్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి, వాటిని నివేదికలో చేర్చనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+