35 రోజుల్లో కూటమి ప్రభుత్వ అప్పు ఎంత - ఏం జరుగుతోంది..!!

సంపద సృష్టిస్తా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతీ రోజు చెప్పిన మాట. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 35 రోజుల్లో పూర్తిగా అప్పుల పైనే ఆధారపడుతోంది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించుకుంటోంది. ఆగస్టు ఒకటో తేదీన జీతాలు, సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ నుంచి తాజాగా మరో మూడు వేల కోట్లు సమీకరించింది. దీంతో, 35 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ 12 వేల కోట్లు అప్పు చేసింది.

కూటమి ప్రభుత్వ అప్పులు
ఏపీలో జూన్ 12న కొత్త చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రభుత్వం ఏర్పాటు సమయానికి కేంద్రం నుంచి నిధుల వాటాతో సహా ఖజనాలో దాదాపు రూ 7 వేల కోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తం అప్పు పైన ప్రభుత్వం..వైసీపీ చెబుతున్న లెక్కల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏపీ పైన రూ 14 లక్షల కోట్ల రుణ భారం ఉన్నట్లు చంద్రబాబు, పవన్ ప్రచారం చేసారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రం అప్పు రూ 9.74 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు వెల్లడించారు.

AP Govt has taken rs 12000 cr by Security Bonds Auction at RBI in last 35 days

35 రోజుల్లో రూ 12 వేల కోట్లు
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందుకు భిన్నమైన లెక్కలను బయట పెట్టారు. ఇక..కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత గత నెల 25న ఆర్బీఐ నుంచి రూ 2 వేల కోట్ల అప్పు చేసింది. ఆ తరువాత గత నెల 25న రూ 5 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ నెల 16న రూ 2 వేల కోట్లు మరోసారి రుణం సమీకరించింది. తాజాగా ఈ నెల 30న సెక్యూరిటీల వేలం ద్వారా రూ 3 వేల కోట్ల రుణం సమీకరించింది. ఇందులో 1,000 కోట్లు 15 సంత్సరాల కాల వ్యవధి, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలు, అదే విదంగా మరో వెయ్యి కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34 శాతం వడ్డీతో అప్పు చేసింది.

ఓట్ ఆన్ ఎకౌంట్
ఆగస్లు 1న ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు నిధులు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగానే అప్పు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే..కూటమి ప్రభుత్వం ఏర్పడిన 35 రోజుల్లోనే రూ 12 వేల కోట్ల మేర అప్పు చేయటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+