మరో సీనియర్ ఐపీఎస్ పై వేటు - లిస్టులో నెక్స్ట్..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో నాడు పలు అంశాల్లో కీలకంగా వ్యవహరించిన అధికారుల పై ఆరోపణలు ఉండటంతో చర్యలు మొదలు పెట్టింది. జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పైన వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సస్పెన్షన్ వేటు
వైసీపీ హయాంలో నాడు ప్రభుత్వానికి మద్దతుగా.. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి సంజయ్ పై ప్రభుత్వం వేటు వేసింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలతో ఆయన పై సస్పెన్షన్ వేటు పడింది. సంజయ్ అనుమతి లేకుండా విజయవాడ వీడరాదని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఐడీ అధికారిగా సంజయ్ శైలి పైన విమర్శలు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ వేటు పడింది.

AP Govt issues IPS officer Sanjay orders due to allegations against him in YSRCP regime

టెండర్ల నిర్వహణలో
సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో సంజయ్ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్‌ టెండర్లు పిలిచారు. దీనిలో సౌత్రికా, క్రిత్వ్యాప్‌ టెక్నాల జీస్‌ సంస్థలతో పాటు మరో సంస్థ కూడా పాల్గొంది. ఒప్పందం ప్రకారం సదస్సుల నిర్వహణకు నిధులు విడుదల చేసారు. అయితే, సదస్సుల నిర్వహణ అంతా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ చేపట్టాల్సి ఉన్నా, సీఐడీ అధికారులే వాటిని నిర్వహించటం పైన విమర్శలు ఉన్నాయి. అప్పడు చేసిన ఖర్చు పైనా చర్చ జరిగింది. ఇక, అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణకు టెండర్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయి.

విజిలెన్స్ విచారణలో
ఈ అంశంలో బిడ్లు సమర్పించేందుకు.. 3 సంస్థలకే అవకాశం కల్పించారు. ఇందులోనూ సౌత్రికా , క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌తో పాటు మరో సంస్థ టెండర్లలో పాల్గొంది. ఎల్‌-1 కాకపోయినా సౌత్రికా టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇందు కోసం చేసిన చెల్లింపుల పైన ఆరోపణలు రావటంతో..విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. ఈ అక్రమాలకు ప్రధాన బాధ్యుడు సంజయేనని పేర్కొంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. దీంతో, నాడు విమర్శలు ఎదుర్కొన్న ఇతర అధికారుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+