ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ - గత ఉత్తర్వుల నిలిపివేత..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం ఈ నెల 12న ఏర్పాటు కానుంది. దీనికి ముందే కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల అమలు పైన తాజాగా ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఎన్నికల ముందు ఏపీలో దాదాపు 1400 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల వెనుక అనివీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా వాటిని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వరుస నిర్ణయాలు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కానీ, ఇప్పటికే పాలనా పరంగా కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. అటు మంత్రివర్గ ఏర్పాటుతో పాటుగా తన టీంను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు సిద్దం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల అమలు నిలుపుదలకు నిర్ణయించారు. ఎన్నికల సమయంలో మొత్తంగా 1400 మంది టీచర్లను బదిలీ చేసారు. ఇప్పుడు వాటి అమలు నిలుపుదల చేసారు.

AP Govt issues orders over Implementation of Teachers transfers decision befor elections

టీచర్ల బదిలీకి బ్రేక్
గత ప్రభుత్వం జారీ చేసిన ఈ టీచర్ల బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. మంత్రి బొత్సా విద్యా శాఖ పర్యవేక్షించారు. ఆ సమయంలో దాదాపు 1400 మంది టీచర్ల బదిలీలు పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నాడుమంత్రి బొత్స ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగం ఉంది. దీని పైన టీడీపీ ముఖ్యులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో..ముందుగా ఆ బదిలీలు నిలుపుదల చేయాలని సూచనలు రావటం తో విద్యా శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

విచారణ దిశగా
ఇక, ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ వ్యవహారం పైన విచారణ దిశగా నిర్ణయం ఉండే అవకాశం ఉంది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుతానికి అబయెన్స్ లో పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటి పైన సమీక్షించిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే...ఈ ఒక్కటే కాకుండా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా వచ్చిన నిర్ణయాల పైన టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+