పండుగ వేళ భారీగా మద్యం ధరలు పెంపు - కొత్త రేట్లు..ప్రభుత్వ ఉత్తర్వులు..!!

ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అడిషన్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రద్దు చేసింది. దీని ద్వారా బార్లు... మద్యం దుకాణాల్లో ఉన్న ధరల్లో వ్యత్యాసాన్ని తెలిగిస్తూ నిర్ణయించింది. దీని ద్వారా మద్యం ధరలు పెరగున్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ 99 క్వార్టర్ మద్యం.. బీర్ల మీద మాత్రం పెరుగుదల ఉండదు. కొత్త మద్యం ధరల ద్వారా ప్రభుత్వానికి రూ 1,391 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. ఈ మేరకు తాజా మంత్రివర్గ భేటీలో ఎక్సైజ్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసారు.

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బార్లు.. మద్యం షాపులు దిగుమతి చేసుకునే మద్యం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఏఆర్‌ఈటీ (అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మద్యం షాపుల లైసెన్సీలకు ఎమ్మార్పీపై మార్జిన్‌ ఒక శాతం పెంచాలని, వీటివల్ల ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలను లిక్కర్‌ సీసాపై రూ.10 పెంచాలని నిర్ణయించింది.

ap-govt-latest-decision-over-liquor-rates-in-bars-and-wine-shops-details-here

ఈ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదించారు. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందుబాటులోకి తీసుకొచ్చిన క్వార్టర్ రూ 99 మద్యం పైన పెంపుదల ఉండదు. బీర్లకు మినహాయింపు ఇచ్చారు.

అదే విధంగా వైన్‌ తో పాటుగా రెడీ టూ డ్రింక్స్‌పైనా పెంపు ఉండదు. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేల్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఏఆర్‌ఈటీ రద్దు నిర్ణయంలో తో రూ.340 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే షాపుల లైసెన్సీలకు 1శాతం మార్జిన్‌ పెంచడం వల్ల కూడా కొంత ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది.

మున్సిపల్‌ కార్పొరేషన్ల వెలుపల 5 కి.మీ. పరిధిలో త్రీస్టార్‌ లేదా అంతకంటే ఎక్కువస్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై 10 శాతం ఏఆర్‌ఈటీ విధించింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏఆర్‌ఈటీని రద్దుచేసి ధరలను సమానం చేసింది. దీని ద్వారా ఆర్దికంగా వచ్చే నష్టం భర్తీ చేసుకునేందుకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి ప్రతీ మద్యం సీసా పైన రూ 10 మేర ధర పెరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+