ఏం జరుగుతోంది?: రియల్ చంద్రబాబుతో రీల్ చంద్రబాబు, బాలయ్య కూడా!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ టూరిజం అభివృద్ధి చేసే పనిలో పడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో నటుడు రానా దగ్టుబాటి, దర్శకుడు క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి) చంద్రబాబును కలిశారు.

బాబును కలిశారు..
కాగా, క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రియల్ చంద్రబాబును రీల్ చంద్రబాబు రానా కలవడం చర్చనీయాంశంగా మారింది. ‘ఎన్టీఆర్'లో చంద్రబాబుగా నటించేందుకు రానా అంగీకరించినట్టు వస్తున్న వార్తలకు ఈ భేటీ మరింత బలం చేకూర్చింది.

ఆకట్టుకునేలా అమరావతి..
అమరావతి ఎంతో ఆకట్టుకునేలా ఉందని, సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు అమరావతి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సినీ హీరో రానా వ్యాఖ్యానించారు.

ఫిల్మ్ సిటీ అండ్ ఇనిస్టిట్యూట్..
తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.

ఏపీలో సినీ పరిశ్రమ..
రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, సినీ టూరిజం పేరిట కొత్త తరహా ఆకర్షణను ప్రోత్సహించవచ్చన్న ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు సహకరించాలని చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications