ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీకి వైసీపీ కీలక డిమాండ్..!

ఏపీలో స్థానిక సంస్దల ఎన్నికలకు (AP Local Body Polls) రాష్ట్రంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటివరకూ అన్ని పార్టీలతో అఖిలపక్ష భేటీ మాత్రం నిర్వహించలేదు. దీంతో స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘానికి చెప్పాల్సిన విషయాలను రాజకీయ పార్టీలు నేరుగా ఫిర్యాదులు చేయడం లేదా లేఖలు రాయడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై స్పష్టత కోసం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ (YSRCP) ఇవాళ ఈసీని కోరింది.

సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!
సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!

ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాశారు. ఎన్నికల సన్నాహక చర్యలు, ఏర్పాట్లపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు స్పష్టమైన, ఏకరీతి సమాచారం కోసం ఈ భేటీ అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అవసరమైన సర్టిఫికెట్ల జారీ ఆలస్యం, వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల జాబితాలు, అధికార యంత్రాంగం ద్వారా బెదిరింపులు లేదా దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనలపై సకాలంలో చర్చ జరగాలని ఈసీని కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో కుల, నో-డ్యూస్/ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీకి సర్వర్‌ సమస్యలను కారణంగా చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్న తీరుపైనా చర్చ జరగాలని ఆయన కోరారు.

AP Local Body Polls YSRCP Urges State Central Election Commissions to Hold All-Party Meet
Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!
Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!

అలాగే సీనియర్‌ గ్రామ, వార్డు సచివాలయ అధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరపాలని, సంబంధిత న్యాయ ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు, సీట్ల రొటేషన్‌, ఎన్నికల షెడ్యూల్‌, దశలవారీగా ఎన్నికల నిర్వహణ, నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ, మేయర్లు-చైర్‌పర్సన్ల ఎన్నిక, ఓటింగ్‌ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అధికారుల తటస్థత, పోలింగ్‌-కౌంటింగ్‌ సమయంలో భద్రత, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం వంటి అంశాలపై అఖిలపక్ష భేటీలలో చర్చించాలని ఆయన కోరారు. అర్హులైన అభ్యర్ధులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొనే హక్కును పరిరక్షించేందుకు సమగ్ర సంప్రదింపులు అవసరమని లేఖలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే, చట్టపరమైన, న్యాయపరమైన గడువులకు అనుగుణంగా వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+