రేపటి నుంచి గూడ్స్ రవాణా బంద్, లారీ యజమానుల నిర్ణయం..!!
రాష్ట్రంలో సరుకు రవాణా నిలిచిపోనుంది. లారీల యాజమానుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించు కోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగాలని లారీ ఓనర్స్ అసోసి యేషన్ నిర్ణయం తీసుకుంది. సమ్మె జరిగితే నిత్యావసరాల నుంచి అన్నింటి పైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు రవాణా శాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
లారీల యాజమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం లారీ యజమానుల నెత్తిపై పిడుగులా పడింది. పాత వాహనాల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను భారీగా పెంచడంపై రవాణా రంగం భగ్గుమంటోంది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డుల నుంచి నడిచే సుమారు 10 వేలకు పైగా గూడ్స్ రవాణా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నారు.

లారీలు రోడ్డెక్కకపోతే ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా స్తంభించిపోయి వ్యాపార వర్గాలకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం పెంచిన ఫీజుల పెంపుదల చూసి లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. 13 నుంచి 20 ఏళ్ల వయసున్న వాహనాలపై ఫీజులను గణనీయంగా పెంచారు. ఇక 20 ఏళ్లు దాటిన వాహనాల పరిస్థితి మరీ దారుణంగా మారిందని చెబుతున్నారు.
ఇప్పటివరకు రూ. 1,300 మాత్రమే ఫిట్‌నెస్ ఫీజుగా చెల్లిస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఏకంగా రూ. 33,000 చెల్లించాల్సి వస్తోంది. డీజిల్ ధరలు, టోల్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమపై భారంగా మారాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన ఈ నిబంధనలను రాష్ట్రంలో అమలు చేయకుండా ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అసోసియేషన్ వాదిస్తోంది.
పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్‌నెస్ చార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఫీజులు తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో 9వ తేదీ నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. దీంతో.. సమయం దగ్గర పడుతుండటంతో.. సమ్మె విషయంలో రవాణా శాఖ ఏం చేస్తుందనేది కీలకంగా మారుతోంది.
-
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications