Ambati vs Ayyanna: ట్విట్టర్లో మొరుగుతూ సైడ్ అయిపోయిన సన్నాసి ఎవరు?: మంత్రి ఘాటు కౌంటర్
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఒక ట్వీట్ చేశారు. అందులో ఏపీ క్యాబినెట్ మంత్రి ఒకరు ఒక మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని, దానికి తగ్గ సాక్ష్యాలు ఇప్పటికే చేరవల్సినవారికి చేరాయని, త్వరలోనే ఆయన మంత్రి పదవి ఊడిపోనుందనేది ఆ ట్వీట్ లోని సారాంశం. ఆ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన మాట వాస్తవమని, ఆ మంత్రిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
అయ్యన్నపాత్రుడు తన ట్వీట్ లో మంత్రి అన్నారేకానీ ఆయన పేరు వెల్లడించలేదు. కాకపోతే కాంబాబు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చివర్లో తన ట్వీట్ ను అయ్యన్నపాత్రుడికి ట్యాగ్ చేశారు. దీన్నిబట్టి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో మంత్రి అంబటి రాంబాబు అయ్యన్న పాత్రుడికి కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఆ మంత్రి అంబటి రాంబాబు అనే విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లైందని ట్రోలింగ్ చేస్తున్నారు.

గతంలో కూడా ఆ మంత్రిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అవి తనవి కావంటూ ఆయన వాటిని ఖండించారు. మార్ఫింగ్ చేసి వాటిన విడుదల చేశారని, నేరస్తులను పట్టుకొని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన మంత్రిగా లేరు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రి, రేపల్లె బస్టాండ్ సంఘటనలు మరువకముందే ఏకంగా ఒక మంత్రిపై ఆరోపణలు రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. దీంట్లోని నిజనిజాలను వెలికితీయాలని కోరుతున్నారు. సదరు మంత్రిని మంత్రి పదవి నుంచి దింపేవరకు పోరాటం చేస్తామని తెలుగుదేశం, జనసేన వర్గాలు ప్రకటించాయి.















Click it and Unblock the Notifications