BRO : బ్రో మూవీపై అంబటి షాకింగ్ కామెంట్స్- వారాహి శాపంతో ఫ్లాప్-శ్యాంబాబు పాత్రపై..!
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో ఫలితంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,డైలాగులతో వచ్చిన ఈ చిత్రంలో శ్యాంబాబు అనే ఓ పాత్రను కమెడియన్ రఘుబాబుతో చేయించారు. ఈ పాత్ర అచ్చు ఏపీ మంత్రి అంబటి రాంబాబులా ఉందని, ఆయన కోసమే ఆ పాత్రను సృష్టించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై స్పందించిన మంత్రి అంబటి ఇవాళ షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా గురించి తాను మాట్లాడనని కానీ ఇవాళ మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బ్రో సినిమాలో శ్యాo..బాబు అనే పాత్ర సృష్టించారని, అందరూ శ్యాo బాబు పాత్రపై మాట్లాడుతున్నారని అంబటి పేర్కొన్నారు. బ్రో ఒక ఫ్లాప్ సినిమా అని, సినిమా కు కలెక్షన్లు లేవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాను కాంట్రవర్సీ చేస్తే ఇంకొన్ని డబ్బులు వస్తాయన్నారు.

సినిమాను సినిమాగా తీయాలని,అలా తీయకపోవడం వల్లే బ్రో ఫ్లాప్ అయిందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.పవన్ తీసుకున్న రెమ్యునేషన్ కూడా సినిమాకు రాలేదన్నారు. పవన్ సినిమాలు ఇక ఆడవని, వారాహి అనే వాహనాన్ని తన కాళ్ళ కింద పెట్టుకుని పవన్ తిరుగుతున్నాడో...ఆ రోజు నుంచే అమ్మవారి శాపం తగిలిందన్నారు. పవన్ సినిమా పరంగా రాజకీయంగా ఫ్లాప్ అని తాను ఎప్పుడో చెప్పానన్నారు.
సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసేటప్పుడు నిర్మాతలు జాగ్రత్త లు పడాలని శ్యాంబాబు పాత్రపై రాంబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అండ్ చంద్రబాబు ముఠా అమెరికా లో డబ్బులు కలెక్ట్ చేసి బ్రో నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కు ఇప్పిస్తున్నారన్నారు. పవన్ తీసుకున్న పూర్తి అమౌంట్ ఇన్ కం టాక్స్ లో చూపించారా అని ప్రశ్నించారు.

చిత్రసీమలో ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి ఆలోచించాలన్నారు. బ్రో సినిమా వెనక ఉన్న విశ్వప్రసాద్ బ్లాక్ మనీ వైట్ చేసి పవన్ కు ప్యాకేజ్ రూపం లో ఇస్తున్నారని అంబటి ఆరోపించారు. ఇది ఒక స్కామ్ అని, దీనిపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications