ఏపీ మంత్రి వేణుకు సొంత సామాజికవర్గం నుంచి షాక్: రాజీనామా చేయాలంటూ డిమాండ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు సొంత కులస్థుల చేదు అనుభవం ఎదురైంది. ఆయన సామాజిక వర్గానికి చెందినవారే మంత్రిని ఘెరావ్ చేశారు. మే 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, జిల్లా పర్యవేక్షకులుగా ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమలాపురంలోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణను శెట్టి బలిజ సంఘం నేతలు ఘెరావ్ చేశారు. తమ సామాజికి వర్గాన్ని కించపర్చారని.. వైవీ సుబ్బారెడ్డి కాళ్ల ముందు తాకట్టు పెట్టారని వారు మండిపడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శెట్టిబలిజల ఆత్మగౌరవం దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మరో మంత్రి జోగి రమేష్, ఎంపీ మిథున్ రెడ్డి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

 AP minister Venu faces Bitter experience from Own caste people

మంత్రి వేణుగోపాలకృష్ణను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన నేతలు.. శెట్టిబలజ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో మాజీ ఎమ్మెల్యే కూచిపూడి చిట్టబ్బాయి సంస్మరణ జరిగింది. ఈ కార్యక్రామానికి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు.

కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి శెట్టిబలిజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. తమ సామాజిక వర్గానికి చెందినవాడిగా సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డికి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ముందు మోకాళ్లపై కూర్చుని మంత్రి వేణు నమస్కరించారు. దీంతో మంత్రి వేణు తీరుపై శెట్టిబలిజ నాయకులు మండిపడుతున్నారు. శెట్టిబలిజలకు మంత్రి వేణు వెంటనే క్షమాపణలు చెప్పాలని, మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయిేత, తాను సీనియర్ నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతగానే అలా నమస్కరించానని మంత్రి వేణు చెబుతున్నారు. కొందరు తన సామాజిక వర్గానికి చెందినవారిని రెచ్చగొట్టి, తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎంతరెచ్చగొట్టిన తనజాతివారు తనతో ఉంటారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కాళ్ళు తాను పట్టుకున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబులా తాను చీకట్లో చిదంబరం, మోడీ కాళ్లు పట్టుకోలేదని చురకలంటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+