నెల రోజుల ప్రోగ్రస్ రిపోర్ట్, మంత్రుల ర్యాంకులు - పవన్ స్థానం..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తయింది. భారీ మెజార్టీతో అంతకు మించిన అంచనాలతో పాలన మొదలైంది. మూడు పార్టీల నుంచి మంత్రులతో చంద్రబాబు టీం పాలన కొనసాగిస్తోంది. నెల రోజుల పాలన తరువాత ఏపీ మంత్రులు ఏ స్థాయిలో పని చేసారనే అంశం పైన మూడు పార్టీల్లోనూ లెక్కలు మొదలయ్యాయి. ఏ మంత్రికి ఏ స్థానం దక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని తీరుకు ఆయనకు దక్కిన ర్యాంకు ఏంటి.

మంత్రుల పనితీరు
ఏపీలో కొత్త ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉన్నాయి. మూడు పార్టీల నుంచి సీనియార్టీ - యువతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ కూర్పు జరిగింది. తొలి నెలలో ప్రభుత్వ పని తీరు పైన విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తం 25 మందితో ఉన్న మంత్రివర్గంలో ఏ మంత్రి సమర్ధవంతంగా పని చేసారనే చర్చలు వినిపిస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు తన మంత్రివర్గంలోపని చేసే వారికి ర్యాంకులు ఇచ్చేవారు. అయితే, వ్యక్తిగతంగానే మంత్రులకు ఆ సమాచారం అందేది. ఇప్పుడు మంత్రుల పనితీరు వారి శాఖల పైన పట్టు..సమస్యల పరిష్కారం..పని తీరు..పార్టీ కి సమయం వంటి అంశాల ప్రాతిపదికన వారికి ర్యాంకులు కేటాయిస్తున్నారు.

AP Ministers first month performance report in Govt details here

ఎవరికి ఏ స్థానం
ఆ సారి మంత్రుల్లో తొలి స్థానం జనసేన కు చెందిన నాదెండ్ల మనోహర్ తొలి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. శాఖ పైన పట్టు, సమీక్షలు, క్షేత్ర స్థాయి సందర్శనలతో పాటుగా తన నియోజకవర్గ సమస్యల పైన మనోహర్ ఎక్కువగా సమయం కేటాయించారు. ఆ తరువాతి స్థానాల్లో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి లోకేష్ ఉన్నారు. రామానాయుడు శాఖ పరమైన అంశాలతో పాటుగా ప్రతిపక్ష విమర్శలను తిప్పి కొట్టటం..నియోజకవర్గ సమస్యల పైన స్పందిస్తున్న తీరుకు మార్కులు పడుతున్నాయి. ఇక..మంత్రి లోకేష్ నిత్యం ప్రజా దర్బార్ తో ప్రజలతో మమేకం అవుతున్నారు. వ్యక్తిగతంగా, పరోక్షంగా తన వద్దకు వచ్చిన తన శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

AP Ministers first month performance report in Govt details here

పవన్ పని తీరుపై
హోం మంత్రి అనిత సైతం తన శాఖతో పాటుగా ప్రజలతో కలిసేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, పవన్ పని తీరు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పవన్ ఈ నెల రోజుల కాలంలో తాను ఏరి కోరి ఎంపిక చేసుకున్న శాఖల పైన అవగాహన - పట్టు కోసమే ఎక్కువ సమయం కేటాయించారు. ఆర్దికంగా తన శాఖల్లో ఉన్న లోటుపాట్ల పైన అధ్యయనం చేస్తున్నారు. పాలనా పరంగా పవన్ తన శాఖల్లో చెప్పుకొనే స్థాయిలో నిర్ణయాలు లేవు. ప్రజాదర్బార్ ద్వారా సామన్యులను అందుబాటులో ఉంటున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా..ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక నిర్ణయాల్లో రాజకీయంగా మద్దతుగా నిలుస్తున్నారు. సమన్వయం దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+