ఐపీఎస్ సునీల్ నాయక్ ఉదంతంలో బిగ్ టర్న్: ఇకపై..
బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా ఏకంగా బీహార్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మొదట్లో ఏపీ పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిరాకరించిన అనంతరం ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సునీల్ నాయక్ కు భారతీయ న్యాయ సంహిత కింద చట్టపరమైన రక్షణ కల్పించింది.
ఈ మేరకు బీహార్ హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ అమలేందు కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఒక్క సునీల్ నాయక్ వరకు మాత్రమే పరిమితం కావట్లేదు. రాష్ట్రంలో పని చేసే పోలీసులందరికీ కూడా వర్తిస్తుంది. తమ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు, పోలీసులపై ఇతర రాష్ట్రాలు ఏవైనా చర్యలు తీసుకోవాలంటే ఇకపై బిహార్ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.

బీఎన్ఎస్ లోని సెక్షన్ 218 కింద రాష్ట్ర పోలీసులకు ఈ రక్షణ కల్పించింది బీహార్ ప్రభుత్వం. ఏ పోలీసు అధికారిపైన అయినా కేసు నమోదు చేయాలన్నా, కోర్టు విచారణ చేపట్టాలన్నా వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను తొలుత ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అవి సంతృప్తికరంగా ఉంటేనే తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి చేసింది. సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు ఉన్న రక్షణను రాష్ట్ర పోలీసులకు కూడా వర్తింపజేసింది.
మొదట్లో ఏపీ పోలీసులకు సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిసరైన పత్రాలు లేకపోవడం, ప్రక్రియలో లోపాలను కారణంగా చూపుతూ ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. 2024లో ఏపీలో దాఖలైన ఓ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ఉండటం ఆయన అరెస్టుకు కారణమైంది. 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఏపీలో ఇంటర్ కేడర్ డెప్యుటేషన్‌పై పనిచేశారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో బీహార్ ఫైర్ అండ్ హోం గార్డ్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2021లో తనను అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని, హత్యాయత్నం చేశారని, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, ఇప్పటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వారిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307 కింద సునీల్ నాయక్ సహా మరికొందరు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం సునీల్ నాయక్ తన మాతృ రాష్ట్రానికి తిరిగివెళ్లారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications