వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆయేషామీరా హత్యపై పునర్విచారణ', 'ఆ నివేదిక ఇవ్వండి'

బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య కేసును పునర్విచారణ చేయాలని ఆమె తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు దోషులను వదిలేసి నిర్ధోషి సత్యంబాబును ఇరికించారని ఆమె ఆరోపించారు.

విజయవాడకు సమీపంలోని హస్టల్‌లో ఉన్న విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు నిందితులు.అయితే ఈ హత్య కేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సత్యంబాబు నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.

AP rape and murder case: Ayesha Meera’s mom seeks justice

అయితే ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసును తాజాగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో అసలు వాస్తవాలను తెలుసుకొనేందుకు మంచి ఏజెన్సీని ఎన్నుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనమడు సతీష్‌కు సంబంధం ఉందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో చోటుచేసుకొన్న తప్పిదాలపై అపెక్స్ కమిటీ నివేదికను ఆగష్టు 8వ, తేదిలోపుగా తమ ముందుంచాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
The Mother of BPharmacy student Ayesha Meera on Tuesday demanded re-investigation into the rape and murder case of her daughter. She also sought action against the erring officials who misled the investigation that caused the acquittal of the accused, P. Satyam Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X