ఏపీ, తమిళనాడు భేష్: కాలిఫోర్నియా వర్సిటీ కొనియాడింది.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఇదివరకు రోజుకు 10 వేల వరకు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 6 వేలకు చేరుకుంది. అయితే కరోనా నియంత్రణలో కూడా ఏపీలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కేసుల తీవ్రత తగ్గుతోందని వెల్లడించారు.
ఇటు మరణాల సంఖ్య కూడా తగ్గింది. వైరస్ సోకిన వారికి దాదాపు అందరికీ వేగంగా తగ్గుతోంది. అయితే ఏపీతోపాటు తమిళనాడు కూడా కరోనా వైరస్ నియంత్రణలో భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తెలిపింది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ సోకిన మరణాల శాతం ఏపీలో తక్కువగా ఉందన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ విధానం వల్లే ఇది సాధ్యమైందని విజయసాయిరెడ్డి వివరించారు. ఇందుకోసం సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
covid 19 నియంత్రణలో ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తేల్చింది. దేశంలోనే కరోనా మరణాల శాతం ఆంధ్రాలో అత్యల్పం. టెస్టింగ్ - ట్రేసింగ్ విధానంవల్లే ఇది సాధ్యమయ్యింది . జగన్ గారు అనుసరిస్తున్న ఆరోగ్య విధానాలు దేశానికే ఆదర్శం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 5, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేస్తున్నప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో కొత్త కరోనా కేసులు, మరణాలసంఖ్య కూడా క్రమంగా తగ్గుతూనే ఉంది. కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇదీ ఊరటనిచ్చే అంశం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిన్నటి వరకు 7,19,256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications